News January 27, 2025
అంతరిక్షం నుంచి మహాకుంభమేళా ఫొటోలు

యూపీ ప్రయాగ్రాజ్లో ‘మహా కుంభమేళా’ వైభవంగా కొనసాగుతోంది. రోజూ కోట్లాది మంది భక్తుల పుణ్యస్నానాలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రాత్రి వేళ విద్యుత్ కాంతులతో ఉన్న మహాకుంభమేళా వైభవాన్ని ISSలో ఉన్న నాసా వ్యోమగామి డాన్ పెటిట్ ఫొటో తీశారు. ‘గంగా నది తీరంలో ప్రపంచంలోనే అతి పెద్ద మానవ సమ్మేళనం రాత్రివేళ వెలుగులీనుతోంది’ అని రాసుకొచ్చారు. ఈ చిత్రాలు వైరలవుతున్నాయి.
Similar News
News October 16, 2025
474 ఇంజినీరింగ్ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

UPSC 474 ఇంజినీరింగ్ సర్వీసెస్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిప్లొమా/ఇంజినీరింగ్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్), MSc చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.200, మహిళలు, SC,ST, PwBDలకు మినహాయింపు ఉంది. వెబ్సైట్: https://upsconline.nic.in/
News October 16, 2025
వంటింటి చిట్కాలు

* పసుపు, కారం, కరివేపాకు పొడిలాంటివి నిల్వ చేసేటప్పుడు చిటికెడు ఇంగువ కలిపితే ఏడాదిపాటు నిల్వ ఉంటాయి.
* బ్రెడ్ ప్యాకెట్లో బంగాళాదుంప ముక్కలు ఉంచితే ఆ బ్రెడ్ తొందరగా పాడవదు.
* యాలకులు ఫైన్ పౌడర్లా రావాలంటే కొద్దిగా షుగర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి.
* పూరీలు తెల్లగా ఉండాలంటే నూనెలో రెండు జామాకులు వేసి వేయించాలి.
* పకోడీ, జంతికలు చేసేటప్పుడు పిండిలో కొద్దిగా పాలు పోసి కలిపితే కరకరలాడతాయి.
News October 16, 2025
BREAKING: ఏపీకి చేరుకున్న ప్రధాని మోదీ

ప్రధాని మోదీ కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్ సహా పలువురు మోదీకి పుష్పగుచ్ఛాలు అందజేసి వెల్కమ్ చెప్పారు. ప్రధాని అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్లో శ్రీశైలానికి బయల్దేరనున్నారు.