News December 20, 2024

PHOTOS: క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ

image

ఢిల్లీలోని కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ కమ్యూనిటీకి చెందిన ప్రముఖులతో సంభాషించినట్లు మోదీ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను Xలో పోస్ట్ చేశారు.

Similar News

News April 11, 2026

అందరికీ రుణమాఫీ చేశాం: తుమ్మల

image

TG: రైతుల రుణమాఫీలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బ్యాంకులు పంపిన వివరాల మేరకు అందరికీ రుణమాఫీ అయిందని చెప్పారు. 25లక్షల మందికి రూ.2లక్షల చొప్పున మాఫీ చేశామన్నారు. దీనిపై హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక 9 రోజుల్లో రూ.9వేల కోట్ల రైతుభరోసా నిధులు జమ చేశామన్నారు. 2 పంటల కాలంలోనే రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం తమదేనని తెలిపారు.

News April 11, 2026

కడుపులో ఉన్నప్పుడే క్రికెట్ నేర్చుకున్నావా చిచ్చరపిడుగా..!

image

15 ఏళ్ల వయసులో మనమేం చేసుంటాం. స్నేహితులతో సరదాగా ఆడుకొని ఉంటాం. కానీ వైభవ్ సూర్యవంశీ వరల్డ్ క్లాస్ బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. అసలు ఇంత చిన్న వయసులో అలాంటి విధ్వంసం ఎలా సాధ్యమని కోట్లాది మంది అవాక్కవుతున్నారు. ‘తల్లి కడుపులో ఉన్నప్పుడే క్రికెట్ నేర్చుకొని ఉంటాడు’ అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా నాలుగేళ్ల వయసు నుంచే వైభవ్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. 14 ఏళ్లకే తొలి IPL మ్యాచ్ ఆడాడు.

News April 11, 2026

స్పేస్ మిషన్‌లో ఆ 6 నిమిషాలు టెన్షన్.. టెన్షన్!

image

స్పేస్ మిషన్లలో <<19621417>>రీఎంట్రీ<<>> సమయంలో వచ్చే 6 నిమిషాల ‘బ్లాక్ అవుట్’ ఒక సహజ ప్రక్రియే. వ్యోమనౌక వేగానికి గాలి ఒత్తిడికి లోనై 2,760°C వేడి పుడుతుంది. దీంతో క్యాప్సూల్ చుట్టూ ఏర్పడే ‘ప్లాస్మా’ పొర రేడియో తరంగాలను అడ్డుకోవడం వల్ల భూమితో కమ్యూనికేషన్ కట్ అవుతుంది. దీన్నే ‘మినిట్స్ ఆఫ్ టెర్రర్’ అంటారు. వేగం తగ్గి ప్లాస్మా చల్లబడగానే సిగ్నల్ అందుతుంది. అప్పటిదాకా గ్రౌండ్ కంట్రోల్‌లో టెన్షన్ మామూలుగా ఉండదు.