News September 3, 2025

PHOTOS: ఉత్తరాదిలో వర్ష బీభత్సం

image

కుండపోత వర్షాలతో ఉత్తర భారతం వణికిపోతోంది. పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్‌, ఢిల్లీలో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంజాబ్, చండీగఢ్‌, హిమాచల్‌లో ఈనెల 7 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌లో ఫ్లాష్ ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్‌తో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఢిల్లీలో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంత ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

Similar News

News September 5, 2025

సీఎం స్టాలిన్ స్టైలిష్ లుక్

image

పెట్టుబడుల ఒప్పందాల కోసం యూకే పర్యటనకు వెళ్లిన తమిళనాడు సీఎం స్టాలిన్ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. బ్లేజర్, సన్ గ్లాసెస్, ఇన్‌షర్ట్‌తో మెరిశారు. అక్కడి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో పెరియార్ స్కెచ్‌ను ఆయన ఆవిష్కరించారు. మరోవైపు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రోల్స్ రాయిస్ కంపెనీ తమిళనాడులోని హోసూర్‌లో డిఫెన్స్ ఇంజిన్స్ తయారు చేసేందుకు స్టాలిన్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది.

News September 5, 2025

విజ్ఞానం వైపు నడిపే వెలుగే గురువు

image

త్రిమూర్తుల కన్నా సృష్టికర్త బ్రహ్మకన్నా గురువే గొప్పవాడంటారు. ఎందుకంటే ఒక విద్యార్థిని అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు నడిపే మార్గదర్శి ఆ గురువే కాబట్టి. బుద్ధులు నేర్పుతాడు.. బుద్ధిమంతుడిని చేస్తాడు. విద్యార్థి విజయాలనే తన గురు దక్షిణగా భావిస్తాడు. అలాంటి గురువులను మన జీవితంలో కలిగి ఉండటం అదృష్టంగా భావించాలి. ఏమిచ్చినా, ఎన్ని సేవలు చేసినా వారి రుణం తీర్చుకోలేం. అందరికీ గురుపూజోత్సవం శుభాకాంక్షలు.

News September 5, 2025

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తులు శ్రీకృష్ణ గెస్ట్ హౌస్ నుంచి క్యూలో వేచి ఉన్నారు. నిన్న 59,834 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,628 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.49 కోట్లు వచ్చినట్లు TTD అధికారులు వెల్లడించారు.