News September 12, 2025
PHOTOS: వే2న్యూస్ కాన్‌క్లేవ్-2025

AP: నేడు మంగళగిరిలో నిర్వహించిన Way2News కాన్‌క్లేవ్-2025 విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు.. రాజధాని అమరావతి, పోలవరం, పెట్టుబడులు, మెడికల్ కాలేజీలు ఇలా అనేక అంశాలపై తన విజన్‌ను వివరించారు. అటు వైసీపీ నుంచి సజ్జల, బుగ్గన తమ పాలనలో చేసిన పనులు, ఆలోచనలను పంచుకున్నారు. ఈ ప్రోగ్రామ్ ఫొటోస్‌ను పై గ్యాలరీలో చూడొచ్చు.
Similar News
News September 13, 2025
ఆసియా కప్: ఒమన్‌పై పాకిస్థాన్ విజయం

ఆసియా కప్‌లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఒమన్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఆ జట్టు 67 రన్స్‌కే ఆలౌట్ అయింది. హమద్ మీర్జా(27) టాప్ స్కోరర్‌గా నిలిచారు. పాక్ బౌలర్లలో అష్రఫ్, సుఫియాన్ ముకీమ్, సయీమ్ అయుబ్ తలో 2 వికెట్లతో రాణించారు.
News September 13, 2025
భవనం గుండా ఫ్లైఓవర్.. ఎక్కడంటే?

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉంటాఖానా అశోక్ చౌక్ వద్ద నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మిస్తోన్న ఫ్లైఓవర్ చర్చనీయాంశమవుతోంది. ఫ్లైఓవర్‌ను ఏకంగా నివాస భవనం గుండా తీసుకెళ్లడంతో ప్రజలు వింతగా చూస్తున్నారు. జవాబుదారీతనం లేకపోవడంతోనే ఇలా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. గతంలోనూ ఓ రైల్వే ఓవర్ బ్రిడ్జిని 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన విషయం తెలిసిందే.
News September 13, 2025
ట్యాబ్లెట్ వేసుకోగానే నొప్పి ఎలా తగ్గుతుందంటే?

శరీరంలో ప్రతి మందుకీ ప్రత్యేకమైన గ్రాహకాలు(రిసెప్టార్లు) ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ‘పేగులు, రక్తంలో కలిసి కాలేయం గుండా వెళ్లినప్పుడు మందు కొంత కరుగుతుంది. మిగిలినది గుండెకు చేరి అక్కడి నుంచి శరీరమంతా చేరుతుంది. ఒళ్లంతా వెళ్లినా పనిచేయాల్సిన గ్రాహకాలు కొన్ని భాగాల్లోనే ఉంటాయి. ఉదా.. పెయిన్ కిల్లర్ మందు మెదడులోని ఓపియాయిడ్ గ్రాహకాలను ఉత్తేజం చేసి నొప్పిని తగ్గేలా చేస్తుంది’ అని పేర్కొన్నారు.