News July 12, 2024
అమ్మాయితో ఫొటోలు వైరల్.. హార్దిక్కు ఫ్యాన్స్ సలహా

నటాషాతో విడాకుల వార్తల నడుమ హార్దిక్కు ఫ్యాన్స్ కొత్త సలహా ఇస్తున్నారు. పాండ్యతో ఓ అమ్మాయి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ‘హార్దిక్ ఆమెను పెళ్లి చేసుకో’ అని చెబుతున్నారు. వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని ప్రచారమూ జరిగింది. ఆ ఫొటోలోని అమ్మాయి ప్రాచీ సోలంకి ఇన్స్టాలో ‘ఫ్యాన్ గర్ల్ మూమెంట్ ’ అని దీనిపై క్లారిటీ ఇచ్చారు. అయితే విడాకులపై స్పష్టత లేకుండా సలహాలివ్వడాన్ని కొందరు తప్పుబడుతున్నారు.
Similar News
News January 27, 2026
USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి

అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. అనేక నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లక్షల మంది అంధకారంలో ఉన్నారు. పలు ఘటనల్లో 29 మంది మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 15కుపైగా రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొనగా రవాణా స్తంభించిపోయింది. మంచు తుఫాన్ ప్రభావంతో సుమారు 17వేలకుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. పరిస్థితులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
News January 27, 2026
ఫైబర్ ఎందుకు తీసుకోవాలంటే..

మనల్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాల్లో ఫైబర్ ఒకటి. ఇందులో సాల్యుబుల్ ఫైబర్, ఇన్ సాల్యుబుల్ ఫైబర్ అనే రకాలుంటాయి. దీనివల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగయ్యి గ్యాస్, అసిడిటీ, ఉబ్బరం, మలబద్దకం తగ్గుతాయి. కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ నియంత్రణలో ఉంటాయి. పురుషులకు రోజుకు 30 గ్రా, స్త్రీలకు 25 గ్రా ఫైబర్ అవసరం. 2-5 ఏళ్ల పిల్లలకు 15 గ్రా, 5-11 ఏళ్లు పిల్లలకు 20 గ్రా వరకు రోజూ ఫైబర్ కావాలి.
News January 27, 2026
బీజేపీ vs కాంగ్రెస్.. ‘పట్కా’ వివాదం

రిపబ్లిక్ డే వేడుకలు INC-BJP మధ్య వివాదానికి కారణమైంది. రాహుల్, ఖర్గేలకు <<18966146>>మూడో వరుసలో<<>> సీట్లు కేటాయించడంపై కాంగ్రెస్ అవమానంగా భావిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ప్రోటోకాల్ ప్రకారమే సీట్ల కేటాయింపు జరిగిందని BJP స్పష్టం చేసింది. మరోవైపు సాయంత్రం రాష్ట్రపతి ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో ముర్ము చెప్పినా ఈశాన్య ప్రాంత సంప్రదాయమైన పట్కాను (స్కార్ఫ్ వంటి వస్త్రం) రాహుల్ ధరించలేదంటూ మరో వివాదం చెలరేగింది.


