News October 23, 2024
PIC OF THE BRICS: ఒకే ఫ్రేమ్‌లో షిఫ్టింగ్ వరల్డ్ పవర్!
కొన్ని వేల భావాలను ఒక్క చిత్రంతో చూపించొచ్చు! BRICS NEWS షేర్ చేసిన ఈ పిక్ అలాంటిదే. ఇది కొందరి కళ్లు ఎర్రబడేలా చేసింది. మరికొందరి కళ్లల్లో ఆనందం నింపింది. చాలా జియోపొలిటికల్ సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది. ఎడమొహం పెడమొహం పెట్టుకొనే మోదీ, జిన్‌పింగ్ ఒకే ఫ్రేమ్‌లో చిరునవ్వులు చిందిస్తున్నారు. వీరిని కలిపి వెస్ట్‌కు షాకిచ్చిన దర్పం పుతిన్‌లో కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. మరి మీ కామెంట్.
Similar News
News January 3, 2025
SHOCKING: జట్టు నుంచి రోహిత్ ఔట్!
సిడ్నీ టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రచారంలో ఉన్నట్లుగా రోహిత్ శర్మ తుది జట్టు నుంచి తప్పుకొన్నారు. ఆయనకు బదులు కెప్టెన్‌గా బుమ్రా టాస్కు వచ్చారు. రోహిత్ స్వచ్ఛందంగా రెస్ట్ తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక తుది జట్టులో రోహిత్ స్థానంలో గిల్, ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను తీసుకున్నారు. ఆస్ట్రేలియాకు మార్ష్ స్థానంలో వెబ్‌స్టెర్ డెబ్యూ కానున్నారు.
News January 3, 2025
‘టెట్’ తొలిరోజు ప్రశాంతం
TG: రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షలు తొలిరోజైన గురువారం ప్రశాంతంగా ముగిశాయి. 17 జిల్లాల్లో 92 పరీక్షా కేంద్రాల్లో తొలిరోజు పరీక్షకు ఉదయం 72.25శాతం మంది, మధ్యాహ్నం 75.68శాతం మంది హాజరయ్యారు. ఈ నెల 20 వరకు 10 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్-2, 8, 9, 10, 18 తేదీల్లో పేపర్-1 పరీక్షని నిర్వహించనున్నారు.
News January 3, 2025
2097 స్కూళ్లలో విద్యార్థులు లేరు!
TG: దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలల సంఖ్యలో రాష్ట్రం 3వ స్థానంలో నిలిచింది. ఏకంగా 2097 స్కూళ్లలో పిల్లలే లేరని డీఐఎస్ఎఫ్ఏ విడుదల చేసిన నివేదిక(2023-2024) తేల్చిచెప్పింది. పశ్చిమ బెంగాల్(3254), రాజస్థాన్(2187) తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా విద్యార్థుల్లేని పాఠశాలలు 12,954 ఉండగా వాటిలో తెలంగాణలోనే 2వేల పైచిలుకు ఉండటం ఆందోళనకరం.