News November 2, 2024
PIC OF THE DAY
న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఆకట్టుకుంది. డైవ్ క్యాచ్‌తో పాటు ఫీల్డింగ్‌లో అదరగొట్టారని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. ఈరోజు మ్యాచ్ పూర్తయ్యే సరికి కోహ్లీ జెర్సీ బురదమయంగా మారిన ఫొటోను షేర్ చేస్తూ ‘PIC OF THE DAY’ అని కొనియాడుతున్నారు. టీమ్ గెలుపుకోసం ఎంతో కష్టపడతారని అభినందిస్తున్నారు. అయితే, బ్యాటింగ్‌లోనూ ఇదే కసి ఉండాల్సిందని మరికొందరు సూచిస్తున్నారు.
Similar News
News November 2, 2024
నీలి రంగు అరటి పండ్లు.. ఐస్‌క్రీమ్ తిన్నట్లే రుచి!
పసుపు, ఆకుపచ్చగా ఉండే అరటి పండ్లనే చూస్తుంటాం. కానీ నీలి రంగులోనూ అరటి పండ్లుంటాయనే విషయం చాలా మందికి తెలియదు. దీనిని బ్లూజావా అని పిలుస్తుంటారు. ఇది వెనీలా ఐస్ క్రీమ్ టేస్టును కలిగి ఉంటుంది. ఇవి అగ్నేయాసియాలో పెరుగుతుందని, హవాయిలో బాగా ప్రాచుర్యం పొందిందని, ‘ఐస్ క్రీమ్ బనానా’ అని పేరు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ అరటి పండును మీరెప్పుడైనా టేస్ట్ చేశారా?
News November 2, 2024
రేవంత్ నిర్ణయాలతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందులు: KTR
TG: పరిపాలనా అనుభవం లేకుండా సీఎం రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలతో పేద, మధ్యతరగతి ప్రజలే ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. HMDA పరిధిలోని గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని వెంచర్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం మూర్ఖత్వమేనని మండిపడ్డారు. రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు కావంటే పేద ప్రజల పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. LRS ఫ్రీగా చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని ఆయన గుర్తుచేశారు.
News November 2, 2024
ఓఆర్ఆర్పై కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు
TG: రోడ్డు ప్రమాదాల నివారణకు హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ORRపై కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించారు. ఔటర్ రింగ్ రోడ్ ఎంట్రీ, ఎగ్జిట్ల వద్ద ఈ టెస్టులు చేస్తారు. ఇప్పటికే యాక్సిడెంట్ అనాలసిస్ ప్రివెన్షన్ టీమ్‌లు కూడా ఏర్పాటు చేశారు. కాగా మద్యం తాగి ORRపై మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతుండటంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.