News November 24, 2024
PIC OF THE DAY

ఒకప్పుడు ఉప్పు, నిప్పులా ఉన్న విరాట్, గంభీర్ టీమ్ ఇండియా కోసం కలిసిపోయిన సంగతి తెలిసిందే. ఈరోజు పెర్త్ టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో గంభీర్ భావోద్వేగానికి లోనయ్యారు. విరాట్‌ను హత్తుకుని అభినందించారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని టీమ్ ఇండియా ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. మ్యాచ్‌లో విరాట్ 143 బంతుల్లో 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
Similar News
News January 6, 2026
పిల్లలకు బోటులిజం వస్తే ఏమవుతుందంటే?

ఇంఫాంట్ బోటులిజంలో పిల్లల కండరాలు బలహీనపడతాయి. చూపు మందగించడం, అలసట, నీరసం, సరిగ్గా ఏడవలేకపోవడం, పీల్చడం, మింగడంలో ఇబ్బందులు పడతారు. శ్వాస తీసుకోవడంలో కూడా కష్టం కలగవచ్చు. ఇది ఒక వైద్య అత్యవసర పరిస్థితి. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చు. ఈ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా తేనెలో చాలా తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ, పిల్లలకు అది కూడా ప్రమాదకరమే అంటున్నారు నిపుణులు.
News January 6, 2026
HUDCOలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఢిల్లీలోని <
News January 6, 2026
నేడు చంద్రుడిని దర్శించుకుంటే పుణ్యం: పండితులు

సంకటహర చతుర్థి వ్రతంలో చంద్ర దర్శనం అత్యంత కీలకమైన ఘట్టం. సాధారణ చతుర్థి నాడు చంద్రుడిని చూడకూడదని చెబుతారు కానీ, సంకటహర చతుర్థి నాడు మాత్రం చంద్రుడిని చూస్తేనే వ్రత ఫలం లభిస్తుందట. సాయంత్రం చంద్రోదయం తర్వాత చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి భక్తులు తమ ఉపవాసాన్ని విరమిస్తారు. ఇలా చేస్తే మనసు ప్రశాంతంగా మారి, జాతకంలోని చంద్ర దోషాలు తొలగి, తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.


