News December 30, 2024
PIC OF THE DAY

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సుందర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో AUS టీమ్ మొత్తం వికెట్లకు సమీపంలోనే ఫీల్డింగ్ చేశారు. లయన్ బౌలింగ్లో బ్యాటర్ చుట్టూ ఫీల్డింగ్ మోహరించారు. అయినప్పటికీ సుందర్ ధైర్యంగా ఆడినా సిరాజ్ ఆందోళనకు గురై ఔటయ్యారు. కాగా ఈ ఫీల్డ్ సెట్టింగ్ ఫొటోను షేర్ చేస్తూ PIC OF THE DAY అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
Similar News
News November 22, 2025
నౌహీరా షేక్ రూ.19.64 కోట్ల ఆస్తి వేలం

TG: హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్ అక్రమార్జన కేసులో ED కీలక చర్యలు చేపట్టింది. ఆమెకు చెందిన రూ.19.64 కోట్ల విలువైన ఆస్తిని వేలం వేసి విక్రయించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసింది. నౌహీరా షేక్ అధిక లాభం ఇస్తామంటూ ప్రజల నుంచి రూ.5,978 కోట్ల పెట్టుబడులు సేకరించి మోసగించారు. ఇప్పటివరకు రూ.428 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని బాధితులకు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.
News November 22, 2025
నేడు పుట్టపర్తికి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి

AP: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ఇవాళ సత్యసాయి(D) పుట్టపర్తికి వెళ్లనున్నారు. ప్రశాంతి నిలయంలో జరిగే సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఉ.11 గంటలకు ముర్ము అక్కడికి చేరుకోనున్నారు. ఎయిర్పోర్టులో CM చంద్రబాబు స్వాగతం పలకనున్నారు. మ.3.40గంటలకు రాధాకృష్ణన్ చేరుకుంటారు. సత్యసాయి యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవానికి రాధాకృష్ణన్, చంద్రబాబు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
News November 22, 2025
పెళ్లి చేసుకుంటున్నారా? శ్రీవారి కానుక అందుకోండిలా..

పెళ్లి చేసుకునేవారికి TTD ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. నూతన దంపతులకు వేంకటేశ్వరస్వామి ఆశీర్వచనంతో కూడిన మహా ప్రసాదం, కల్యాణ తలంబ్రాలు, కుంకుమ, కంకణాలను ఉచితంగా పంపిస్తుంది. అందుకోసం వివాహ తొలి శుభలేఖను కార్యనిర్వహణాధికారి, టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, తిరుపతి చిరునామాకు పంపితే చాలు. వివాహానికి ఓ నెల ముందు పత్రిక పంపితే, స్వామివారి ప్రసాదం వివాహ సమయానికి అందుతుంది.


