News June 21, 2024
PIC OF THE DAY.. అల్లుడిని ఆశీర్వదించిన బాలయ్య

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. MLAగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన నారా లోకేశ్‌ను బాలయ్య ఆశీర్వదించారు. ప్రమాణ స్వీకారం చేసి వెళ్తుండగా.. అక్కడే ఉన్న లోకేశ్ వద్దకు వెళ్లి మనస్ఫూర్తిగా ఆయన్ను ఆశీర్వదించారు. తనకు కేటాయించిన శాఖల విధులను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించి మంత్రిగా మంచి పేరు తెచ్చుకోవాలని అల్లుడికి సూచించారు. ‘PIC OF THE DAY’ అని నెటిజన్లు ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు.
Similar News
News December 7, 2025
శ్రీకృష్ణుని విగ్రహంతో యువతి వివాహం

శ్రీకృష్ణుని మీద భక్తితో ఓ యువతి ఆయన విగ్రహాన్ని వివాహం చేసుకుంది. యూపీలోని బదాయు(D) బ్యోర్ కాశీమాబాద్‌కు చెందిన పింకీ శర్మ(28) కృష్ణుడిని తన జీవిత భాగస్వామిగా ఎంచుకుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని అయిన ఆమె వివాహాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు దగ్గరుండి జరిపించారు. పింకీ శ్రీకృష్ణుని విగ్రహాన్ని పట్టుకుని ఏడడుగులు వేసింది. కాగా ఇలాంటి ఘటనలు నార్త్ ఇండియాలో గతంలోనూ జరిగిన సంగతి తెలిసిందే.
News December 7, 2025
ALERT.. రేపటి నుంచి భారీగా పడిపోనున్న ఉష్ణోగ్రతలు

TG: రాష్ట్రంలో రేపటి నుంచి వారం రోజుల పాటు తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 18 జిల్లాల్లో 9-12డిగ్రీలు, 12 జిల్లాల్లో 6-9 డిగ్రీల వరకు టెంపరేచర్స్ పడిపోతాయని అంచనా వేశారు. డిసెంబర్ 10 నుంచి 13 వరకు తీవ్రమైన చలిగాలులు వీస్తాయని తెలిపారు. పగటి వేళల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు.
News December 7, 2025
సమ్మిట్ ఆహూతులకు స్పెషల్ బొనాంజా

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. 44 దేశాలనుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొననున్నారు. రేపు 1.30కు సమ్మిట్‌ను గవర్నర్ ప్రారంభిస్తారు. CM 2.30కు ప్రసంగిస్తారు. TG సంస్కృతి, HYD ఆధునికత ఉట్టిపడేలా ప్రతినిధులకు స్వాగతం, ప్రసిద్ధ వంటకాలతో ఆతిథ్యం అందిస్తారు. సమ్మిట్ ఎప్పటికీ గుర్తుండేలా ప్రత్యేక సావనీర్, వివిధ పిండివంటలతో కూడిన బాస్కెట్‌ను ఆహూతులకు అందించనున్నారు.


