News July 17, 2024
ఒకే బిడ్డకు రెండుసార్లు జన్మనిచ్చావమ్మా!

ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఖమ్మం జిల్లాకు చెందిన అమల తన 3ఏళ్ల కుమారుడు ఆదిత్యకు కాలేయ దానం చేశారు. చిన్నారి పుట్టుక నుంచి కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు. కాగా ఉస్మానియా వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేసి ఆదిత్యకు కాలేయ మార్పిడి చేశారు. సర్జరీ అనంతరం ఆ తల్లి తన కుమారుడికి భోజనం తినిపించి మురిసిపోయారు. తద్వారా ఒకే బిడ్డకు రెండుసార్లు జన్మనిచ్చారు. మీరేమంటారు?
Similar News
News January 25, 2026
నేడు ఆదిత్య హృదయం ఎందుకు పఠించాలి?

సూర్యారాధన వల్ల అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యమవుతాయని నమ్మకం. రామాయణ యుద్ధంలో అలసిన రాముడికి అగస్త్యుడు ‘ఆదిత్య హృదయం’ బోధించారని పురాణాలు చెబుతున్నాయి. దీన్ని పఠిస్తే లభించిన శక్తితోనే రాముడు రావణుడిని సంహరించగలిగాడని నమ్ముతారు. అలాగే మయూరుడు అనే కవి సూర్యుని స్తుతించి కుష్టు వ్యాధి నుంచి విముక్తుడయ్యాడు. పాండవులు అరణ్యవాసంలో సూర్యుని అనుగ్రహంతోనే ‘అక్షయపాత్ర’ను పొంది అతిథి సత్కారాలు చేయగలిగారు.
News January 25, 2026
పోలవరం నిర్వాసితులకు పరిహారం ఎప్పుడంటే?

AP: పోలవరం ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ నిర్వాసితులకు జూన్లోగా పరిహారం ఇవ్వాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. మొత్తం 21,709 కుటుంబాలకు పరిహారం అందజేసేందుకు రూ.2,497.98 కోట్లు అవసరం అని అంచనా వేసింది. 2027 మార్చి నాటికి ప్రాజెక్టు తొలిదశ పనులను, ఈ ఏడాది డిసెంబర్లోగా పునరావాస కాలనీల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 28 కాలనీలు పూర్తవగా మరో 49 కాలనీల పనులు పూర్తి కావాల్సి ఉంది.
News January 25, 2026
రథ సప్తమి గురించి ‘యోగశాస్త్రం’ ఏం చెబుతుందంటే..?

యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలో ఇడా, పింగళ అనే 2 నాడులుంటాయి. ఇందులో పింగళ నాడి సూర్య నాడికి సంకేతం. ప్రాణాయామం ద్వారా ఈ నాడులను శుద్ధి చేసినప్పుడు కుండలినీ శక్తి మేల్కొంటుంది. సూర్యుడు బాహ్య ప్రపంచానికి వెలుగునిస్తే, యోగ సాధన ద్వారా మనలోని చిదాత్మ ప్రకాశిస్తాడు. రథసప్తమి నాడు చేసే సాధన మనలోని ఈ అంతర్గత శక్తిని మేల్కొల్పుతుంది. అందుకే ఈ పర్వదినాన కొద్దిసేపైనా యోగా చేయాలని పండితులు సూచిస్తారు.


