News March 4, 2025
KCRపై అనర్హత వేయాలని పిల్.. విచారణ వాయిదా

TG: KCR అసెంబ్లీకి రావడం లేదని దాఖలైన పిల్ను హైకోర్టు విచారించింది. ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయనకు సభలో ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన బాధ్యత ఉందని, సభకు రాని ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు. దీనిపై తాము జోక్యం చేసుకోవచ్చా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. పిల్కు అర్హత లేదని అసెంబ్లీ తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు వినిపించేందుకు పిటిషనర్ గడువు కోరడంతో 2 వారాలకు వాయిదా పడింది.
Similar News
News March 4, 2025
SLBC టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి

TG: SLBC టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది. సొరంగంలో పనుల కోసం ఉపయోగించే కన్వేయర్ బెల్ట్ మరమ్మతులకు గురికాగా, సాంకేతిక సిబ్బంది దాన్ని పునరుద్ధరించారు. ప్రస్తుతం అది పని చేస్తోంది. దీంతో సొరంగంలోని బురద, మట్టిని తొలగించే ప్రక్రియ వేగవంతం కానుంది. సొరంగంలో చిక్కుకుపోయిన 8మంది ఉద్యోగుల ఆచూకీ కోసం 10 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
News March 4, 2025
Stock Markets: గ్యాప్డౌన్ నుంచి రికవరీ..

స్టాక్మార్కెట్లు స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ 22,082 (-36), సెన్సెక్స్ 72,989 (-96) వద్ద ముగిశాయి. గ్యాప్డౌన్లో మొదలైన సూచీలు నష్టాలను కొంత పూడ్చుకున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా, మెటల్, PSU బ్యాంకు, వినియోగం, O&G షేర్లు ఎగిశాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా సూచీలు నష్టపోయాయి. ఎస్బీఐ, BPCL, BEL, శ్రీరామ్ ఫైనాన్స్, Adani Ent టాప్ గెయినర్స్. బజాజ్ ఆటో, హీరోమోటో, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ లూజర్స్.
News March 4, 2025
ఐదేళ్లుగా ఆదాయం పెరగడం ఆగిపోయింది: పయ్యావుల

AP: రాష్ట్రంలో ఐదేళ్లుగా ఆదాయం పెరగడం ఆగిపోయిందని మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో అన్నారు. ‘రాష్ట్ర ఆదాయం, కేంద్రం నుంచి వచ్చేది కలిపి రూ.1,54,065cr. రాష్ట్రం అప్పులు, వడ్డీలు రూ.63,962cr కట్టాల్సి ఉంది. జీతభత్యాలు, వడ్డీలు, అప్పుల అసలు కలిపి రూ.65,962cr ఖర్చు చేస్తున్నాం. జీతభత్యాలు, అప్పులు, వడ్డీలకే మనకు వచ్చే ఆదాయం సరిపోతోంది. అభివృద్ధి పనులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి’ అని అన్నారు.