News March 22, 2024
కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని పిల్

కేజ్రీవాల్‌ను ఢిల్లీ సీఎం పదవి నుంచి తప్పించాలని ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. సామాజిక కార్యకర్త సుర్జిత్ సింగ్ యాదవ్ ఈ పిల్ దాఖలు చేశారు. లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ అరెస్టు అయ్యారని, సీఎంగా ఆయనను తొలగించాలని పిటిషన్లో కోరారు. కాగా, సీఎంను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ రౌస్ అవెన్యూ కోర్టును కోరుతోంది. దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి.
Similar News
News February 23, 2025
కొత్త రేషన్ కార్డులపై BIG UPDATE

AP: వచ్చే నెల నుంచి క్యూఆర్ కోడ్‌తో కూడిన <<15497715>>కొత్త రేషన్ కార్డులు<<>> అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా సంగంలో మాట్లాడుతూ పాత కార్డుల్లో మార్పులు, చేర్పులకూ అవకాశం కల్పిస్తామన్నారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. ఇక రైతులకు పెండింగ్‌లో ఉన్న రవాణా, హమాలీ ఛార్జీలను రెండు రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు.
News February 23, 2025
ఏప్రిల్ 29న NCET.. నోటిఫికేషన్ విడుదల

2025-26లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి NCET(నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. మార్చి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి తెలిపింది. APR 29న దేశవ్యాప్తంగా తెలుగు సహా 13 భాషల్లో పరీక్ష నిర్వహిస్తామంది. ర్యాంక్ ఆధారంగా 64 IIT, NIT, కేంద్రీయ వర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొంది.
వెబ్సైట్: <
News February 23, 2025
టన్నెల్ ఘటన.. కార్మికుల ప్రాణాలపై ఆందోళన

TG: SLBC టన్నెల్లో చిక్కుకున్న వారి ప్రాణాలపై ఆందోళన నెలకొంది. నిన్న ఉదయం 8-9 గంటల మధ్య టన్నెల్లో మట్టి కూలడం మొదలైంది. వెంటనే కొంతమంది బయటికి వచ్చినా 8 మంది మాత్రం అక్కడే చిక్కుకున్నారు. సాయంత్రానికి NDRF బృందం అక్కడికి చేరుకుంది. ఇవాళ్టి నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టనుంది. సముద్ర మట్టానికి 834 అడుగుల దిగువన కార్మికులు చిక్కుకుపోవడంతో వారికి ఆక్సిజన్ అందుతోందా? లేదా? అన్నదే కీలకంగా మారింది.