News April 12, 2025
అమలాపురం వైసీపీ ఇన్ఛార్జిగా పినిపే

AP: వైసీపీ పలు పదవులకు నియామకాలు చేపట్టింది. అమలాపురం అసెంబ్లీ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా పినిపే శ్రీకాంత్‌ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్, కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్, క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని నియమించింది.
Similar News
News January 27, 2026
ఎబోలాలో మ్యుటేషన్.. మరింత వేగంగా వ్యాప్తి!

ఎబోలా వైరస్ ఇన్ఫెక్షన్ సామర్థ్యాన్ని పెంచే కీలక మ్యుటేషన్‌ను చైనా పరిశోధకులు గుర్తించారు. 2018-2020లో కాంగోలో వచ్చిన అతిపెద్ద ఎబోలా ఔట్‌బ్రేక్‌ను వాళ్లు అధ్యయనం చేశారు. హెల్త్‌కేర్ లోపాల వల్లే కాకుండా జన్యువుల్లో మార్పులతోనూ వైరస్ వేగంగా వ్యాపించిందని ‘సెల్’ జర్నల్‌లో పబ్లిష్ అయిన స్టడీ వెల్లడించింది. ఎబోలా నివారణా చర్యలు, డ్రగ్స్ తయారీపై మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది.
News January 27, 2026
అమల్లోకి ఎన్నికల కోడ్

TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల <<18974641>>షెడ్యూల్ విడుదలైన<<>> నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని SEC రాణి కుముదిని హెచ్చరించారు. ఫిబ్రవరి 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుందని చెప్పారు. 2996 వార్డులకు ఎన్నికలకు జరుగుతాయని తెలిపారు. 8,203 పోలింగ్ కేంద్రాలు, 136 కౌంటింగ్ సెంటర్లను సిద్ధం చేశామన్నారు.
News January 27, 2026
ChatGPT, Geminiతోనే ఫుడ్ ఆర్డర్.. స్విగ్గీ ఓపెన్ చేయక్కర్లేదు!

ఇకపై మీ ఫుడ్ ఆర్డర్లను లేదా సరకుల డెలివరీలను ట్రాక్ చేయడానికి స్విగ్గీ యాప్ ఓపెన్ చేయాల్సిన పనిలేదు. నేరుగా ChatGPT, Gemini వంటి AI చాట్‌బాట్‌లతోనే పని కానిచ్చేయొచ్చు. ‘మోడల్ కాంటెక్స్ట్ ప్రొటోకాల్’ సాయంతో స్విగ్గీ ఈ సేవలను ప్రారంభించనుంది. దీంతో చాట్ చేస్తూనే ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. సరకులు తెప్పించుకోవచ్చు. యూజర్ల తరఫున AI ఏజెంట్లే ఈ ప్రాసెస్‌ను పూర్తి చేస్తాయి. జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు.


