News September 10, 2024
స్కిల్స్ లేకపోతే పింక్ స్లిప్ ఖాయం?

ప్రస్తుతం టెక్ కంపెనీలు భారీగా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. IT ఉద్యోగం అంటే తుమ్మితే ఊడే ముక్కు అనే పరిస్థితికి వచ్చింది. AI రాక ఉద్యోగులకు శరాఘాతంగా మారింది. పాత స్కిల్స్తో ఉద్యోగంలో కొనసాగడం కష్టం కాబట్టి IT ఉద్యోగులు, ఫ్రెషర్లు నైపుణ్యాలు పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. AI, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, మెషీన్ లెర్నింగ్, బ్లాక్ చెయిన్ వంటి వాటిలో నైపుణ్యం సాధించాలని చెబుతున్నారు.
Similar News
News November 1, 2025
కాశీబుగ్గ తొక్కిసలాట.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

AP: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో 10మంది భక్తులు మృతి చెందడంపై PM మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తొక్కిసలాటలో భక్తులు మరణించడం దురదృష్టకరమని Dy.CM పవన్ ట్వీట్ చేశారు.
News November 1, 2025
ఇంతమంది వస్తారని అనుకోలేదు: హరిముకుంద్

AP: శ్రీకాకుళం కాశీబుగ్గ వేంకటేశ్వరాలయంలో తొక్కిసలాటపై నిర్వాహకుడు 95 ఏళ్ల హరిముకుంద్ పండా స్పందించారు. ఇంతమంది భక్తులు వస్తారని ఊహించలేదని చెప్పారు. భక్తులు విపరీతంగా వచ్చారని, గతంలో ఎప్పుడూ ఇంతమంది రాలేదని తెలిపారు. కాగా గతంలో తిరుమలకు వెళ్లిన హరిముకుంద్కు సంతృప్తిగా స్వామివారి దర్శనం కలగలేదు. దీంతో తనకు గల 50 ఎకరాల్లో 10 ఎకరాల్లో ఆలయం నిర్మించారు.
News November 1, 2025
వేలానికి బంగారు టాయిలెట్.. ప్రారంభ ధర ₹83Cr!

బంగారంతో తయారుచేసిన టాయిలెట్ కమోడ్ వేలానికి సిద్ధమైంది. ఇటాలియన్ కళాకారుడు మౌరిజియో కాటెలాన్ ఈ విచిత్ర కళాఖండానికి ‘అమెరికా’ అని పేరు పెట్టారు. ధనవంతుల అహంకారం, వారి ఆర్భాటపు జీవితం ఎంత నిష్ఫలమో ఈ ‘గోల్డ్ టాయిలెట్’ ద్వారా సందేశం ఇస్తున్నట్లు సృష్టికర్త పేర్కొన్నారు. న్యూయార్క్లో నవంబర్ 18న వేలం జరగనుంది. ప్రారంభ ధర ₹83 కోట్లుగా నిర్ణయించారు.


