News June 27, 2024
పిన్నెల్లికి 14 రోజుల రిమాండ్

AP: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు, కారంపూడి సీఐపై దాడి కేసుల్లో రిమాండ్ విధించగా.. ఈవీఎం ధ్వంసం, మహిళపై దాడి కేసుల్లో బెయిల్ మంజూరు చేశారు. పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించాలని జడ్జి ఆదేశించారు.
Similar News
News November 1, 2025
ఇండియన్ స్టూడెంట్స్‌కు మరో గండం

ట్రంప్ ఆంక్షలతో కకావికలమవుతున్న ఇండియన్ స్టూడెంట్స్‌కు మరో గండం వచ్చి పడింది. ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియాను ఎంచుకుందామనుకుంటే అక్కడా లోకల్ నినాదం స్టార్టైంది. అక్కడి HEIల్లో 50%కి పైగా అడ్మిషన్లు ఆస్ట్రేలియన్లకే ఇవ్వాలని ఆ దేశ విద్యాశాఖ మంత్రి జేసన్ క్లార్ ఆదేశించారు. సిడ్నీ వర్సిటీలో 51% మర్దోక్‌లో 57% RMITలో 50% మంది విదేశీ విద్యార్థులే ఉన్నారు. దీంతో లోకల్స్‌కు అవకాశం దక్కేలా కోటా విధించారు.
News November 1, 2025
ఇతరుల అదృష్టం చూసి, వారిలా ఇల్లు కట్టొచ్చా?

ఇతరుల అదృష్టం చూసి వారి ఇంటిలాగే మనం కూడా ఇల్లు కట్టుకుంటే అదే ఫలితం ఉండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ఇంటి నిర్మాణానికి, ఇంటి స్థలం, దిశ, ముఖద్వారాలకు ఇంటి యజమాని పేరు, జన్మరాశి అనుకూలంగా ఉండాలన్నారు. ‘ఇంట్లో వస్తువులు, ఫర్నిచర్, మంచాలు వంటి అమరికలు కూడా వాస్తు నియమాలకు అనుగుణంగా ఉండాలి. అప్పుడే మనకు అనుకూలమైన మంచి ఫలితాలు పొందే అవకాశం ఏర్పడుతుంది’ అని పేర్కొన్నారు. <<-se>>#Vasthu<<>>
News November 1, 2025
ప్రైవేటు ఆలయం అంటూ తప్పించుకునే ప్రయత్నం: జగన్

AP: కాశీబుగ్గ తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని YCP చీఫ్ జగన్ ఆరోపించారు. ‘రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరికించడంపై చంద్రబాబుకు ఉన్న శ్రద్ధ ఆలయాలకు వచ్చే భక్తులకు భద్రత కల్పించడంలో లేదు. ఏకాదశి వేళ భక్తులు వస్తున్నారని తెలిసినా చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇప్పుడు ప్రైవేటు ఆలయం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం ఇవ్వాలి’ అని ట్వీట్ చేశారు.


