News May 23, 2024
హైకోర్టులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్

AP: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కాసేపట్లో ఈ పిటిషన్పై కోర్టు విచారణ జరపనుంది. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి కోసం పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News November 28, 2025
కరీంనగర్: 2019 సం.లో 108.. మరి ఇప్పుడు..?

2019 స్థానిక ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1210 గ్రామ పంచాయతీలు ఉండగా, మొత్తం 108 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో KNRలో 15, PDPలో 13, JGTLలో 37, SRSLలో 43 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అయితే, ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షల నిధులు కేటాయిస్తామనటంతో, ఈ నిధులతో తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని అనుకున్న నాయకుల ఆశలపై అప్పటి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా నీళ్లు చల్లింది.

నేడు కామారెడ్డికి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య

కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించనున్న PDSU 23వ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య హాజరుకానున్నారు. PDSU జిల్లా కమిటీ సభ్యులు తెలిపారు. జిల్లాలోని పీడీఎస్యూ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై, మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.