News May 11, 2024

ట్రెండింగ్‌లో పిఠాపురం

image

పోలింగ్ సమీపించడంతో తెలుగు రాష్ట్రాల చూపు పిఠాపురంపై పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో ఆ నియోజకవర్గం పేరు ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఇతర నటులు పవన్‌కు మద్దతు ప్రకటించారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిన పవన్.. ఈసారి గెలిచి చట్టసభల్లోకి అడుగుపెడతారా? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు జగన్ ఇవాళ పిఠాపురంలో ప్రచారం చేయనున్నారు.

Similar News

News January 14, 2026

సంక్రాంతికి ముగ్గులు ఎందుకు వేయాలి?

image

సంక్రాంతికి వేసే ‘రంగవల్లి’ అంటే రంగుల వరుస అని అర్థం. ఇంటి ముంగిట ముగ్గు వేయడం లక్ష్మీదేవికి ఆహ్వానం పలకడమే కాదు, బియ్యప్పిండితో వేయడం వల్ల మూగజీవాలకు ఆహారం కూడా లభిస్తుంది. ముగ్గుల్లోని జ్యామితీయ ఆకృతులు చూసేవారి మనసుకు ప్రశాంతతను ఇస్తాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. వంగి ముగ్గులు వేయడం మహిళలకు మంచి వ్యాయామం. ముగ్గుల్లో వాడే రంగులు సంపదకు, బలానికి సంకేతాలుగా నిలుస్తూ, ఇంటికి శుభాలు చేకూరుస్తాయి.

News January 14, 2026

రూ.15,000 పెరిగిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీపై ఏకంగా రూ.15,000 పెరిగి రూ.3,07,000కు చేరింది. బంగారం ధరలు సైతం గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,090 ఎగబాకి రూ.1,43,620కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,000 పెరిగి రూ.1,31,650గా ఉంది. 3 రోజుల్లో కేజీ వెండి ధర రూ.32,000 పెరగడం గమనార్హం.

News January 14, 2026

దారుణం.. విష ప్రయోగంతో 600 కుక్కలు మృతి

image

TG: కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. వీధికుక్కలపై విషప్రయోగం జరగడంతో దాదాపు 500-600 శునకాలు మృతిచెందాయి. మాచారెడ్డి(M) ఫరీద్‌పేట్, భవానీపేట, వాడి, పల్వంచలో నూతనంగా ఎంపికైన సర్పంచ్‌లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనపై ‘గౌతమ్ స్ట్రే యానిమల్స్ ఫౌండేషన్’ ప్రతినిధులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.