News April 18, 2024
పాపం ధవన్.. కొడుకును తల్చుకుంటూ..

క్రికెటర్ శిఖర్ ధవన్ ఇన్‌స్టాలో కుమారుడు జోరావర్‌ను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘నువ్వెప్పటికీ నాతోనే ఉంటావ్. మై బాయ్’ అంటూ జెర్సీ షేర్ చేశారు. భార్య అయేషా క్రూరత్వం కారణంగా ఢిల్లీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. ఆమె ఆస్ట్రేలియన్ సిటిజన్ కావడంతో కొడుకుతో పాటు అక్కడికి వెళ్లిపోయారు. వీడియో కాల్‌కు సైతం ఆమె నిరాకరించడంతో కొడుకును తలుచుకుంటూ ధవన్ దీనంగా ఉంటున్నారు.
Similar News
News February 1, 2026
కిచెన్ గార్డెన్‌కి ఈ మొక్కలు సెట్

ఇంటి తోటలోనే కాకుండా వంటింట్లో ఖాళీ స్థలం ఉంటే అక్కడా మనకు కావాల్సిన పచ్చదనాన్ని పెంచేయొచ్చు. ఆ మొక్కలేవో చూసేద్దాం రండి. వామాకు, కొత్తిమీర, పుదీనా, తులసి వంటి మొక్కలు సులువుగా, తక్కువ ఎండలో కూడా పెరుగుతాయి. వీటిని కిచెన్ గార్డెన్‌లో పెంచడం వల్ల ఆరోగ్యంతో పాటు గాలి కూడా శుద్ధి అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
News February 1, 2026
డ్యూటీలో ప్రాణాలు కోల్పోవడంపై సీఎం ఆవేదన

TG: నిజామాబాద్‌కు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ <<19017490>>సౌమ్య<<>> మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య మృతికి కారణమైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.
News February 1, 2026
కాటన్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

గువాహటిలోని కాటన్ యూనివర్సిటీలో 9 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీ, డాక్యుమెంట్స్‌ను ఫిబ్రవరి 9 వరకు పోస్ట్ చేయాలి. దరఖాస్తు ఫీజు రూ.1000, SC,STలకు రూ.500. వెబ్‌సైట్: https://cottonuniversity.ac.in/


