News December 28, 2024
PJR.. నిన్ను హైదరాబాద్ మరువదు!
గ్రేటర్ రాజకీయాల్లో నేడు చీకటి రోజు. కార్మిక నాయకుడు, పక్కా హైదరాబాదీ P. జనార్దన్ రెడ్డి తుది శ్వాస విడిచిన రోజు. కార్మికనాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టి ఖైరతాబాద్ నుంచి 5 సార్లు MLAగా గెలిచారు. పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత PJRదే. ఒంటి చేత్తో హైదరాబాద్, రాష్ట్ర రాజకీయాలను శాసించారు. అటువంటి మాస్ లీడర్ గుండెపోటుతో 2007 DEC 28న కాలం చేశారు. నేడు PJR వర్ధంతి.
Similar News
News January 1, 2025
HYD: న్యూ ఇయర్ ఎఫెక్ట్.. ఊదితే 550
HYDలో ఓ మందుబాబు పీకలదాకా తాగి పోలీసులకు చిక్కాడు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసి ఫలితం చూసి పోలీసులే షాకయ్యారు. పూర్తి వివరాలు.. నిన్న రాత్రి పంజాగుట్టలో పోలీసులు ఓ బైకర్ను ఆపి చెక్ చేశారు. బ్రీత్ అనలైజర్లో ఏకంగా 550 మీటర్ నమోదు కావడం గమనార్హం. బైక్ను సీజ్ చేసి మందుబాబుకు రిసిప్ట్ ఇచ్చి పంపారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ‘ఎంత తాగావు బ్రో’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
News January 1, 2025
HYD: రాష్ట్ర పోలీసుల విశిష్ట సేవలకు పతకాలు
HYD: తెలంగాణ పోలీసుల విశిష్ట సేవలకు పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. తెలంగాణ పోలీసులకు 617 పతకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో శౌర్య పతకం1, మహోన్నత సేవా పతకం17, ఉత్తమ సేవా పతకం 93, కఠినసేవా పతకం 46, సేవా పతకం 460 ఇచ్చారు. నూతన సంవత్సరంలో ఈ సేవా పతకాలు రావడం డీజీపీ జితేందర్ హర్షం వ్యక్తం చేశారు.
News December 31, 2024
HYD: డ్రంక్ అండ్ డ్రైవ్కు చిక్కారో.. ఇక అంతే
న్యూ ఇయర్ వేడుకల వేళ ఆకతాయులు, మద్యం ప్రియుల ఆటలు అరికట్టేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ముందస్తుగా న్యూ ఇయర్ వేడుకల వేళ తీసుకునే చర్యలపై పోలీసులు అప్రమత్తం చేశారు. రాత్రి 8 నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయనున్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10వేలు జరిమానా, 6నెలల జైలు శిక్ష విధించనున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనే HYD వాసులారా జాగ్రత్త.