News December 28, 2024

PJR.. నిన్ను హైదరాబాద్ మరువదు!

image

గ్రేటర్‌‌ రాజకీయాల్లో నేడు చీకటి రోజు. కార్మిక నాయకుడు, పక్కా హైదరాబాదీ P. జనార్దన్ రెడ్డి తుది శ్వాస విడిచిన రోజు. కార్మికనాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టి ఖైరతాబాద్ నుంచి 5 సార్లు MLAగా గెలిచారు. పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత PJRదే. ఒంటి చేత్తో హైదరాబాద్, రాష్ట్ర రాజకీయాలను శాసించారు. అటువంటి మాస్ లీడర్ గుండెపోటుతో 2007 DEC 28న కాలం చేశారు. నేడు PJR వర్ధంతి.

Similar News

News December 29, 2024

HYD: తెలంగాణ క్రికెటర్లు త్రిష, దృతిలకు HCA సన్మానం

image

ఐసీసీ మ‌హిళ‌ల‌ అండ‌ర్‌-19 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌నకు ఎంపికైన తెలంగాణ క్రికెట‌ర్లు జి.త్రిష‌, కె.ధ్రుతిలను ఉప్ప‌ల్ స్టేడియంలో HYD క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు అర్శ‌న‌పల్లి జ‌గ‌న్‌మోహ‌న్‌రావు సన్మానించి, అభినందించారు. ప్ర‌తిష్ఠాత్మ‌క వ‌ర‌ల్డ్‌క‌ప్ వంటి మెగా టోర్నీకి ఇద్ద‌రు తెలంగాణ క్రికెట‌ర్లు ఎంపిక‌వ‌్వడం గ‌ర్వంగా ఉంద‌న్నారు.

News December 29, 2024

రాష్ట్రపతి భవన్‌లో JAN-2 నుంచి సందర్శకులకు ప్రవేశం

image

బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో జనవరి 2 నుంచి 13 వరకు సందర్శకులకు ప్రవేశం కల్పించనున్నారు. ఈసారి ఉద్యాన్ ఉత్సవ్ – పుష్పాలు, హార్టికల్చర్ పండుగను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహించనున్నారు. సుమారు 50 స్టాల్‌తో గ్రాండ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం 4గంటల నుంచి 8 గంటల వరకు వివిధ కళారూపాలను ప్రదర్శిస్తారు.

News December 28, 2024

HYD: అవగాహనతోనే మదకద్రవ్యాల నిర్మూలన: సందీప్ శాండిల్య

image

అవగాహనతో మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని టీజీఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. శనివారం ‘డ్రగ్-ఫ్రీ వెల్‌నెస్’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎడిస్టీస్ ఫౌండేషన్, క్రియేట్ ఎడ్యుటెక్‌లతో సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మార్గదర్శకాలతో ఆన్‌లైన్ ప్రోగ్రామ్ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు.