News April 8, 2024
చంద్రబాబు ప్యాకేజీతోనే PK వ్యాఖ్యలు: వైసీపీ

AP: జగన్ తిరిగి అధికారంలోకి రావడం కష్టమని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన <<13009588>>వ్యాఖ్యలపై<<>> వైసీపీ Xలో మండిపడింది. ‘కొత్తగా CBN నుంచి ప్యాకేజీ అందుకున్న కృతజ్ఞతతో అలా అంటున్నావు. రాష్ట్రాభివృద్ధికి ఎవరేం చేశారన్నది కేంద్ర గణాంకాలు చూస్తే వాస్తవాలు అర్థమవుతాయి. సొల్లు కబుర్లతో బురద జల్లకుండా విద్య, వైద్యం, ప్రజల తలసరి ఆదాయం, పారిశ్రామిక రంగాల్లో AP ప్రగతి గురించి తెలుసుకో’ అని సూచించింది.
Similar News
News November 21, 2025
పదో తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

AP: టెన్త్ <
News November 21, 2025
అమల్లోకి కొత్త లేబర్ కోడ్స్

కార్మికులకు భరోసా కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లు నేడు అమల్లోకి వచ్చాయి. వీటిలో కోడ్ ఆన్ వేజెస్(2019), ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్(2020), కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ(2020), ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ కోడ్(2020) ఉన్నాయి. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీటిని తీసుకొచ్చింది.
News November 21, 2025
పొలంలో ఎలుకల నిర్మూలనకు ముందు ఏం చేయాలి?

వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులు, చీడపీడల తర్వాత ఎలుకలు చేసే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. పొలాల్లోని కలుగుల్లో ఉండే ఎలుకలను పొగబెట్టడం, రసాయన ఎరలు, ఎర స్థావరాల ఏర్పాటుతో నివారించవచ్చు. అయితే ఎలుక కన్నాల సంఖ్యను బట్టి నివారణా చర్యలు చేపట్టాలి. దీనికి ముందు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే పొలం గట్లమీద ఉండే పొదలను తొలగించాలి. గట్లను పారతో చెక్కి తర్వాత ఎలుకల నిర్మూలన చర్యలు చేపట్టాలి.


