News April 8, 2024

పీకే సలహాలు తీసుకుని ఉంటే మునిగేవాళ్లం: బొత్స

image

AP: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీకే సలహాలు తీసుకుని ఉంటే మునిగేవాళ్లమని అన్నారు. అందుకే రెండోసారి ఆయనకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. వైసీపీ నేతల దగ్గర పీకే డబ్బులు తీసుకునేవాడని ఆరోపించారు. మేనేజ్ మెంట్ తప్ప ప్రశాంత్ కిశోర్ చేసేదేమీ లేదని దుయ్యబట్టారు. బిహార్ నుంచి PKను తరిమికొట్టారని అందుకే ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని విమర్శించారు.

Similar News

News February 4, 2026

భార్య అందంగా ఉందని గుండు గీశాడు

image

కర్ణాటలోని బాగల్‌కోట(D)లో అమానవీయ ఘటన జరిగింది. అందంగా ఉన్న తన భార్యను ఇతర పురుషులు చూస్తారని భర్త ఉమేశ్ అనుమానం పెంచుకున్నాడు. ఆమె జుట్టు పొడుగ్గా ఉందని, అందంగా పూలతో అలంకరించుకుంటూ యువకులను వలలో వేసుకుంటోందని అతను భావించాడు. రాత్రి ఫుల్లుగా తాగి భార్యను కత్తితో బెదిరించి గుండు చేశాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

News February 4, 2026

HIVతో ఐదేళ్లలో 44వేల మంది బలి

image

రెండు తెలుగు రాష్ట్రాల్లో 2020-24 మధ్య ఐదేళ్లలో 44,140మంది బాధితులు మరణించారని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి అనుప్రియ పటేల్‌ రాజ్యసభలో ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీలో 32,642 మంది, తెలంగాణలో 11,498 మంది HIV బాధితులు మరణించారని వెల్లడించారు. ప్రజల్లో పెరిగిన నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం దీనికి కారణమని తెలుస్తోంది.

News February 4, 2026

వారణాసిలో రాముడి పాత్ర బిగ్గెస్ట్ ఛాలెంజ్: మహేశ్ బాబు

image

రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’లో రాముడి పాత్ర తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని మహేశ్ బాబు అన్నారు. ‘దేవుడి పాత్రలో గాంభీర్యం కోసం మోడ్రన్ బాడీ లాంగ్వేజ్‌ను మర్చిపోవాల్సి వచ్చింది. దీనికోసం 3నెలల పాటు ‘కలరిపయట్టు’లో శిక్షణ తీసుకున్నాను. నిలబడే తీరు, నడక మార్చుకోవడానికీ ఇది హెల్ప్ అయ్యింది. రన్నింగ్ స్టైల్ ఛేంజ్ చేయడానికీ ప్రాక్టీస్ చేశాను’ అని Varietyకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్ తెలిపారు.