News September 5, 2025
PKL: బోణీ కొట్టిన తెలుగు టైటాన్స్

ప్రో కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ బోణీ కొట్టింది. జైపూర్ పింక్ పాంథర్స్‌తో జరిగిన మ్యాచులో 37-32 పాయింట్ల తేడాతో గెలిచింది. టైటాన్స్ ప్లేయర్లు విజయ్ మాలిక్, భరత్ చెరో 8 పాయింట్లతో అదరగొట్టారు. డిఫెన్స్‌లో ఏకంగా 14 పాయింట్లు రాబట్టారు. అంతకుముందు రెండు మ్యాచుల్లోనూ తెలుగు టైటాన్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
Similar News
News September 5, 2025
సెప్టెంబర్ 5: చరిత్రలో ఈ రోజు

1884: ఆంధ్ర విశ్వకర్మ వంశీయుడు కె.గోపాలకృష్ణమాచార్యులు జననం
1888: భారత తొలి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జననం(ఫొటోలో)
1955: తెలంగాణ ఉద్యమ నాయకుడు ఎం.కోదండరాం జననం
1995: తెలుగు హాస్య నటి గిరిజ మరణం
1997: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరీసా మరణం
* జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం
News September 5, 2025
యంగ్ సెన్సేషన్.. వన్డేల్లో చరిత్ర సృష్టించాడు

సౌతాఫ్రికా యంగ్ క్రికెటర్ మాథ్యూ బ్రిట్జ్‌కే వన్డేల్లో చరిత్ర సృష్టించారు. తొలి ఐదు వన్డే మ్యాచ్‌లలో 50+ స్కోర్స్ చేసిన ఏకైక ప్లేయర్‌గా నిలిచారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో 85 రన్స్ చేసిన బ్రిట్జ్‌కే ఈ ఫీట్ సాధించారు. ఈ 26 ఏళ్ల యంగ్ సెన్సేషన్ న్యూజిలాండ్‌తో ఆడిన అరంగేట్ర మ్యాచ్‌లోనే 150 రన్స్‌తో అదరగొట్టారు. ఆ తర్వాత పాక్‌పై 83, AUSపై 57, 88, తాజాగా ENGపై 85 రన్స్ చేశారు.
News September 5, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.