News October 24, 2025

PKL: టాప్-4లో తెలుగు టైటాన్స్

image

ప్రోకబడ్డీ లీగ్ 12వ సీజన్‌లో ప్లే‌ఆఫ్(టాప్-8) జట్లు ఖరారయ్యాయి. టాప్-4లో పుణేరి పల్టాన్, దబాంగ్ ఢిల్లీ, బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్ ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో హరియాణా స్టీలర్స్, యూ ముంబా, పాట్నా పైరెట్స్, జైపూర్ పింక్ పాంథర్స్ ఉన్నాయి. రేపు జరిగే ప్లే ఆఫ్ మ్యాచుల్లో హరియాణా-జైపూర్, యూ ముంబా-పింక్ పాంథర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నెల 26న బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ పోటీ పడనుంది.

Similar News

News February 10, 2026

వాషింగ్ మెషీన్ వాడుతున్నారా?

image

ప్రస్తుతకాలంలో వాషింగ్ మెషీన్ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అయితే దీన్ని ఉపయోగించడంలో కొన్ని టిప్స్ పాటిస్తేనే దుస్తులు, మెషీన్ మన్నిక బావుంటుంది. * గట్టి, సున్నితమైన వస్తువుల్ని విడిగా జిప్‌లాక్‌ బ్యాగ్‌లో వేసి ఉతకాలి. * క్విక్‌ వాష్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే వాటి నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది. * గాఢత తక్కువగా ఉండే డిటర్జెంట్‌ వాడటం మంచిది. * అయితే వేటిని ఉతకాలన్నా వాషింగ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ బట్టి ఉతకాలి.

News February 10, 2026

వాహనాల టైర్ల కింద నిమ్మకాయ ఎందుకు?

image

వాహనాల టైర్ల కింద నిమ్మకాయలు ఉంచడం వెనుక కారణాలున్నాయి. పూర్వం ఎడ్లబండ్లు, గుర్రపు స్వారీ చేసేటప్పుడు బురద వల్ల పశువుల కాళ్లకు ఇన్ఫెక్షన్లు రాకుండా నిమ్మకాయల్లోని సిట్రిక్ యాసిడ్ రక్షణ ఇచ్చేది. కాలక్రమేణా ఇదొక నమ్మకంగా మారింది. వాహనాలకు దిష్టి తగలకుండా, ప్రమాదాలు జరగకుండా ఉండాలని నేటికీ ఈ విధానాన్ని పాటిస్తున్నారు. శాస్త్రీయంగా ఇప్పుడు అవసరం లేకపోయినా, మానసిక ధైర్యం కోసం ఈ సంప్రదాయం కొనసాగుతోంది.

News February 10, 2026

AI కంటెంట్‌పై లేబుల్ తప్పనిసరి: కేంద్రం

image

AI కంటెంట్‌ను లేబుల్ చేయడం తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కంటెంట్‌ను ఎవరు క్రియేట్ చేశారనే వివరాలు ఉండాలని పేర్కొంది. కంటెంట్‌పై లేబుల్స్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు తొలగించకూడదని తెలిపింది. తప్పుడు కంటెంట్ అని తేలితే కోర్టు/ప్రభుత్వం ఆదేశించిన 3 గంటల్లోగా యాక్సెస్ బ్లాక్ చేయాలని అప్‌డేట్ చేసిన గైడ్‌లైన్స్‌లో పేర్కొంది.