News February 17, 2025
ప్రార్థనా స్థలాల చట్టం కేసు: సుప్రీంకోర్టు అసంతృప్తి

ప్రార్థనా స్థలాల చట్టం కేసుపై కుప్పలు తెప్పలుగా కొత్త పిటిషన్లు రావడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో ముగ్గురు సభ్యుల బెంచ్ వాదనలు వినడంతో ఇద్దరితో కూడిన తమ బెంచ్ పెండింగ్ పిటిషన్లను తీసుకోబోదని CJI సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ‘పిటిషన్లు వేయడానికీ ఓ పరిమితి ఉంటుంది. తాజాగా మరిన్ని వచ్చాయి. వాటిని మేం స్వీకరించలేం. మార్చిలో కొత్త తేదీ ఇస్తాం’ అని తెలిపారు.
Similar News
News January 30, 2026
కందలో ఎలాంటి అంతర పంటలతో మేలు

కంద దుంపలు మొలకెత్తడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి, తక్కువ కాలపరిమితి కలిగిన నువ్వు, మినుము, చిరుధాన్యాలు మొదలైన పంటలను అంతర పంటలుగా ఆయా ప్రాంతాలకు, కాలానికి తగిన విధంగా ఎంపిక చేసి సాగు చేసుకోవచ్చు. అలాగే పసుపులో మిశ్రమ పంటగా కందను వేసుకోవచ్చు. అరటి, కొబ్బరిలో అంతర పంటగా వేసి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. పసుపులో కూడా కందను అంతర పంటగా వేసి మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.
News January 30, 2026
50% కన్వీనర్ కోటా మెడికల్ సీట్లు తప్పించింది జగనే: సత్యకుమార్

AP: GOVT మెడికల్ కాలేజీల్లోని 50% సీట్లు కన్వీనర్ కోటా నుంచి తప్పించి ఫీజు తీసుకొని భర్తీ చేసేలా మాజీ CM జగనే చేశారని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. ‘ఇపుడు PPPలో ఆస్పత్రులను అభివృద్ధి చేస్తుంటే ఆయన ఆరోపణలు చేస్తున్నారు. దీనిలో భాగస్వామ్య సంస్థే నిధులు భరించి అభివృద్ధి చేస్తుంది. డిఫెన్స్లోనూ ఇదే విధానం ఉంది’ అని పేర్కొన్నారు. APR1 నుంచి 1.43 కోట్ల మందికి ₹25 L వరకు ఉచిత వైద్యం అందుతుందన్నారు.
News January 30, 2026
సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై కఠిన చర్యలు: HC

TG: విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై కఠిన చర్యలు తప్పవని HC హెచ్చరించింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కారణంగా ధ్రువపత్రాలు ఇవ్వబోమని వేధిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలా వేధిస్తున్న కాలేజీలపై విద్యార్థులు ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలంది. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై 2 వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.


