News October 7, 2024

పండుగల నేపథ్యంలో ఉగ్రదాడులకు ప్లాన్!

image

దసరా, దీపావళి సందర్భంగా దేశంలో దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ నిఘావర్గాలు తెలిపాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. మార్కెట్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా విదేశీయులే లక్ష్యంగా రాయబార కార్యాలయాల వద్ద ఈ దాడులు జరగొచ్చని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా కార్యాలయాల వద్ద భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.

Similar News

News July 6, 2025

బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగితే..

image

కొందరు బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగేందుకు ఇష్టపడతారు. అలా చేస్తే తొందరగా జీర్ణం అవుతుందని అపోహపడతారు. అయితే ఆ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కూల్ డ్రింక్స్‌ వల్ల జరిగే కార్బొనేషన్ జీర్ణప్రక్రియను దెబ్బతీస్తుందని తెలిపారు. అధిక మొత్తంలో ఉండే చక్కెరతో బరువు పెరుగుతారని చెప్పారు. కూల్ డ్రింక్స్ బదులు మజ్జిగ తీసుకుంటే మేలని సూచిస్తున్నారు.

News July 6, 2025

BJP, TDP, కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు: BRS

image

TG: ప్రజాభవన్ వేదికగా గురుశిష్యులు భేటీ అయి ఏడాదైనా ఆస్తులు-అప్పుల సమస్యలు తీరలేదని BRS ఆరోపించింది. వీరిద్దరి ఫెవికాల్ బంధం తెలంగాణ రైతుల గొంతు కోస్తోందని మండిపడింది. ‘వీరిద్దరి కుట్రలను తెలంగాణ సమాజం ఎప్పుడో పసిగట్టింది. గోదావరి జలాలను పక్క రాష్ట్రానికి దోచిపెడుతున్న రేవంత్‌ను ప్రజలు క్షమించరు. BJP, TDP, కాంగ్రెస్ మూకుమ్మడి కుట్రలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు’ అని ఎక్స్‌లో ట్వీట్ చేసింది.

News July 6, 2025

రేపే లాస్ట్.. డిగ్రీ అర్హతతో ఎయిర్‌పోర్టుల్లో ఉద్యోగాలు

image

ఏఏఐ కార్గో లాజిస్టిక్స్& అల్లైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ పద్ధతిలో 166 అసిస్టెంట్ (సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. ఇంగ్లిష్, హిందీ, లోకల్ భాషలో రాయడం, చదవడం రావాలి. రేపటిలోగా https//aaiclas.aero/career సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం నెలకు రూ.21,000 నుంచి రూ.22,500 వరకు ఉంటుంది.