News November 19, 2024

రాష్ట్ర రోడ్లపైనా టోల్ వసూలు యోచన: సీఎం చంద్రబాబు

image

AP: హైవేల తరహాలో రాష్ట్ర రహదారులపైనా టోల్ ఫీజు విధింపునకు యోచిస్తున్నట్లు CM చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు. ప్రయోగాత్మకంగా గోదావరి జిల్లాల్లో అమలు చేద్దామని ప్రతిపాదించారు. దీనిపై MLAల అభిప్రాయం కోరగా ఆలోచన బాగుందని అందరూ మద్దతు పలికారు. టోల్ వద్దంటే గుంతల రోడ్లపైనే తిరగాల్సి వస్తుందని CM అన్నారు. గ్రామాల నుంచి మండలాల వరకు బైక్‌లు, ఆటోలు, ట్రాక్టర్లకు టోల్ నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.

Similar News

News November 19, 2024

కృత్రిమ వర్షం అంటే ఏంటి?

image

ఢిల్లీలో వాయు నాణ్యత మెరుగుపడాలంటే కృత్రిమ వర్షం కురిపించాలని మంత్రి గోపాల్ కేంద్రాన్ని కోరగా, దానిపై చర్చ మొదలైంది. మేఘాల్లో సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రైఐస్ వంటి కెమికల్స్ చల్లి వర్షం కురిపించడాన్నికృత్రిమ వర్షం లేదా క్లౌడ్ సీడింగ్ అంటారు. తేమతో ఉన్న మేఘాలు, గాలి వాటం సరైన స్థితిలో ఉంటేనే దీనికి వీలవుతుంది. స్టాటిక్, డైనమిక్ రకాలుండగా.. ముందుగానే కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

News November 19, 2024

LIC హిందీ వెబ్‌సైట్‌ను వెనక్కు తీసుకోండి: స్టాలిన్

image

హిందీని బ‌ల‌వంతంగా రుద్దే ప్ర‌య‌త్నాల్లో LIC ఓ ప్ర‌చార సాధ‌నంగా మారింద‌ని TN CM స్టాలిన్ దుయ్య‌బ‌ట్టారు. LIC వెబ్‌సైట్ హిందీ వ‌ర్ష‌న్ స్క్రీన్ షాట్‌ను ఆయన పోస్ట్ చేశారు. ఇంగ్లిష్‌ను ఎంపిక చేసుకొనే ఆప్ష‌న్ కూడా హిందీలోనే ఉంద‌ని మండిప‌డ్డారు. ప్ర‌తి భార‌తీయుడి స‌హకారంతో LIC వృద్ధి చెందింద‌ని, మెజారిటీ వర్గాన్ని ద్రోహం చేయ‌డానికి ఎంత ధైర్యమ‌ని నిల‌దీశారు. దీన్ని వెన‌క్కు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

News November 19, 2024

యువకుడిలా మారే యత్నం.. ముఖం ఎలా మారిందో చూడండి

image

యువకుడిగా కనిపించేందుకు(యాంటీ ఏజింగ్) ఏటా రూ.కోట్లు ఖర్చుచేస్తున్న US మిలియనీర్ బ్రయాన్ జాన్సన్(46) <<13026727>>ప్రయోగం<<>> మలుపు తిరిగింది. ఓ దాత ఇచ్చిన ఫ్యాట్‌ను ముఖంపైన ఇంజెక్ట్ చేసుకోగా ఫేస్ వాచిపోయి అందవిహీనంగా తయారైంది. 7 రోజుల తర్వాత సాధారణ స్థితికి వచ్చిందని అతను తెలిపారు. ఇకపైనా ప్రయోగాలు కొనసాగిస్తానన్నారు. ఏదైనా ప్రొడక్ట్‌ను తయారుచేయడం, మనమే ఆ ప్రొడక్ట్‌గా ఉండటం భిన్నమైన విషయాలన్నారు.