News January 31, 2025
విమాన ప్రమాదం PHOTOS

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన <<15306564>>ఫ్లైట్ యాక్సిడెంట్<<>> ఫొటోలను అధికారులు విడుదల చేశారు. రీగన్ విమానాశ్రయంలో బంబార్డియర్ CRJ-701 విమానం ల్యాండ్ అవుతుండగా సైనిక హెలికాప్టర్ గాల్లో ఢీకొట్టింది. దీంతో విమానం మూడు చోట్ల ముక్కలుగా విరిగిపోయి పోటోమాక్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 64 మంది, హెలికాప్టర్‌లోని ముగ్గురు ప్రాణాలు వదిలారు.
Similar News
News January 27, 2026
ఈ రామకృష్ణ తీర్థంలో స్నానమాచరిస్తే..?

మాఘ పౌర్ణమి సందర్భంగా FEB 1న తిరుమలలోని రామకృష్ణ తీర్థంలో పుణ్య స్నానం ఆచరిస్తే ‘మాఘ స్నాన’ ఫలం దక్కి, సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. మోక్షం లభిస్తుందని సూచిస్తున్నారు. అజ్ఞానంతో తల్లిదండ్రులను, గురువులను దూషించడం వల్ల కలిగే పాపాలను ఈ స్నానం ప్రక్షాళన చేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పుణ్య స్నానం ఆధ్యాత్మిక శుద్ధిని ప్రసాదించి సత్మార్గంలో నడిపిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
News January 27, 2026
దానిమ్మలో బ్యాక్టీరియా మచ్చ తెగులు నివారణ

తెగులు ఆశించిన కొమ్మలను, కాయలను కత్తిరించి నాశనం చేయాలి లేదా కాల్చివేయాలి. తోటలో చెట్ల పాదుల్లో ఎకరాకు 8-10KGల బ్లీచింగ్ పౌడరును చల్లాలి. మొక్కలలో తెగులు లక్షణాలు కనిపిస్తే లీటరు నీటికి బ్లైటాక్స్ 3గ్రా.+ స్ట్రెప్టోసైక్లిన్ 0.2గ్రా కలిపి మొక్క బాగాలు తడిచేటట్లు స్ప్రే చేయాలి. ఈ మందులు పిచికారీ చేసిన వారం, 10 రోజుల తర్వాత కాసుగామైసిన్ (లీటరు నీటికి 3ml)ను స్ప్రే చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
News January 27, 2026
గ్రిడ్ బలోపేతానికి రూ.9319.30 కోట్లు

AP: రాష్ట్రంలో పవర్ గ్రిడ్‌ను బలోపేతం చేసేందుకు రూ.9,319.30 కోట్లతో 55 ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు చేపడుతున్నట్లు ట్రాన్స్‌కో జేఎండీ ప్రవీణ్ చంద్ తెలిపారు. వీటితో గ్రిడ్‌కు అదనంగా 8,853 MVA సామర్థ్యం చేరనుందని అన్నారు. ఇప్పటికే 3,240 MVA విస్తరణతో పాటు 950 సర్క్యూట్ కిలోమీటర్ల లైన్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టులతో మరో 1,558 సర్క్యూట్ కి.మీ. అందుబాటులోకి వస్తాయన్నారు.


