News November 2, 2024

రాష్ట్ర భవిష్యత్తు మార్చేలా ప్రణాళికలు: సీఎం

image

AP: 10 పాలసీలతో రాష్ట్ర భవిష్యత్తు మార్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖ కలెక్టరేట్‌లో మెట్రో రైలు, హైవేలు, పోర్టులు, పర్యాటకం, పరిశ్రమలు, అభివృద్ధి అంశాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 2047 నాటికి ఏపీ అన్ని అంశాల్లోనూ ముందుంటుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

Similar News

News February 2, 2026

ఇండియా గేట్ ఫొటో షేర్ చేసిన ట్రంప్

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ లక్ష్యంగా ఆసక్తికర పోస్టు చేశారు. ఢిల్లీలోని ఇండియా గేట్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఇది అందమైన విజయోత్సవ తోరణం. USలో ఇంతకంటే గొప్ప కట్టడం నిర్మిస్తాం’ అని రాసుకొచ్చారు. అలాగే న్యూస్ మేకర్స్ ఆఫ్-2025 పేరుతో ‘ఇండియా టుడే’ రిలీజ్ చేసిన మ్యాగజైన్ కవర్ పేజీ పోస్టర్‌నూ షేర్ చేశారు. INDతో ట్రేడ్ డీల్ సానుకూలంగా జరుగుతోందన్న సంకేతాలను ట్రంప్ ఇచ్చారని నిపుణులు భావిస్తున్నారు.

News February 2, 2026

జాబ్ క్యాలెండర్: ఖాళీ పోస్టులపై కసరత్తు

image

AP: ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇచ్చి, దాని ప్రకారం పోస్టులు భర్తీ చేయడానికి GOVT శాఖల వారీ ఖాళీలపై కసరత్తు చేపట్టింది. రెవెన్యూలో 13,000, విద్యలో 7,000, వర్సిటీల్లో 3000 ఖాళీలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. PRలో 26,000, మున్సిపల్‌లో 26,800, అగ్రికల్చర్‌లో 3,000, స్కిల్ డెవలప్‌మెంట్‌లో 4,200 ఖాళీలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇతర శాఖల వివరాలూ తెప్పిస్తున్నారు. కాగా 90,000 వరకు ఖాళీలుండొచ్చని అంచనా.

News February 2, 2026

ఎర్రజెండా.. ప్రజల గళం: CM రేవంత్ ‘రెడ్’ మార్క్ పాలిటిక్స్!

image

TG: ప్రజల పక్షాన నిలిచి వాళ్ల గళం వినిపించే పార్టీ ఎర్రజెండా అని CM రేవంత్ రెడ్డి కొనియాడారు. కనీస వేతన చట్టం, అటవీ హక్కుల చట్టం వంటి కమ్యూనిస్టుల ఎన్నో డిమాండ్లను కాంగ్రెస్ పరిష్కరించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఒకే నాణేనికి రెండు వైపులా ఉండే పార్టీల్లా ప్రజలు భావిస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ CPIతో దూరం పెరుగుతోందన్న ప్రచారం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.