News June 18, 2024

మేడారంలో ప్లాస్టిక్ నిషేధం

image

TG: ఈ ఏడాది జరిగిన మేడారం జాతరలో విపరీతమైన ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయిన నేపథ్యంలో ఆలయ పూజారుల సంఘం చర్యలకు దిగింది. మేడారంలో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులను వినియోగించవద్దని నిర్ణయిస్తూ దుకాణాల యజమానులకు సూచించింది. భూమిలో సులభంగా కరిగిపోయే బయోడిగ్రేడబుల్ సంచులను వాడాలని తెలిపింది. వ్యాపారులు ప్లాస్టిక్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Similar News

News April 1, 2026

జలవివాదాల్లో జోక్యం చేసుకోలేం: కృష్ణా బోర్డు

image

తెలుగు రాష్ట్రాల జలవివాదాల్లో జోక్యం చేసుకోలేమని కృష్ణా నది యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. నీటి పంపిణీపై ప్రస్తుతం జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్‌లో విచారణ జరుగుతోందని.. ఇప్పుడు జోక్యం చేసుకుంటే అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలిపింది. శ్రీశైలం-నాగార్జున సాగర్‌లోని కృష్ణా జలాల వాడకం, విద్యుత్ ఉత్పత్తిపై ఏపీని నిలువరించాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిపై ఈ మేరకు స్పందించింది.

News April 1, 2026

లక్నో ఈసారి రాణిస్తుందా?

image

IPL: సొంతగడ్డపై లక్నో సూపర్ జెయింట్స్ ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. గత రెండు సీజన్లలో పాయింట్స్ టేబుల్‌లో ఏడో స్థానానికి పరిమితమైన LSG ఈసారి సమష్టి ప్రదర్శనతో రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు అక్షర్ పటేల్ నేతృత్వంలోని DC మీదా అంచనాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్ కావడంతో బోణీ ఎవరు కొడతారనేది ఆసక్తికరంగా మారింది. రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

News April 1, 2026

కేరళం బీజేపీ మ్యానిఫెస్టోలో సంక్షేమానికి పెద్ద పీట

image

కేరళం ఓటర్లను ఆకర్షించేందుకు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ BJP మ్యానిఫెస్టో ప్రకటించింది. మహిళలు, వితంతువులు, 70ఏళ్లుపైబడిన వృద్ధులకు నెలకు ₹3వేల పెన్షన్ అందిస్తామంది. ప్రతిఇంటికీ నెలకు 20వేల లీటర్ల ఉచిత తాగునీరు, ఓనమ్-క్రిస్మస్ పండగల కోసం పేదలకు ఏటా ఫ్రీగా రెండు LPG సిలిండర్లు ఇస్తామంది. మందులు, నిత్యావసర సరుకులపై పేద మహిళలకు ‘భక్ష్య ఆరోగ్య సురక్ష’ కార్డుతో ప్రతీనెల ₹2500 రీఛార్జ్ ఆఫర్ చేసింది.