News August 9, 2024
త్వరలో అంగన్వాడీల్లో ప్లే స్కూల్స్ ప్రారంభం: సీతక్క

TG: ఈ నెల 13 నుంచి మంత్రి సీతక్క జిల్లాల పర్యటన చేయనున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా రోజుకో జిల్లాలో కలెక్టర్లు, తన శాఖల ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించనున్నట్లు మీడియాతో ఇష్టాగోష్ఠిలో తెలిపారు. సీఎం రేవంత్ విదేశీ పర్యటన నుంచి వచ్చాక అంగన్వాడీల్లో ప్లే స్కూల్స్‌ను అధికారికంగా ప్రారంభిస్తామన్నారు. సీఎస్ఆర్ ఫండ్స్‌ను కార్పొరేట్ సంస్థలు గ్రామాల్లో ఉపయోగించేందుకు సానుకూలంగా ఉన్నాయన్నారు.
Similar News
News November 22, 2025
తీవ్ర పోటీ: రంగారెడ్డి DCC పెండింగ్!

AICC కొత్తగా DCC ప్రెసిడెంట్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని నియమించకపోవడం చర్చనీయాంశమైంది. RCపురానికి చెందిన దేప భాస్కర్ రెడ్డి, బడంగ్‌పేట మాజీ మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి, చేవెళ్ల-భీంభరత్, ఎల్బీనగర్ నేత రాంమోహన్ గౌడ్, షాద్‌నగర్ నుంచి మాజీ MLA ప్రతాప్ రెడ్డి DCC ఆశించినట్లు తెలిసింది. పెండింగ్‌లో ఉంచడానికి తీవ్ర పోటీ ప్రధాన కారణమని సమాచారం.

వాస్తు ప్రకారం ఇంటికి ఏ రంగు ఉండాలి?

ఇంటికి లేత రంగులు (తెలుపు, లేత పసుపు) శ్రేయస్కరమని వాస్తు నిపుణలు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇవి ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని, చల్లదనాన్ని ఇస్తాయని తెలుపుతున్నారు. ‘చిన్న గదులు లేత రంగుల వలన విశాలంగా కనిపిస్తాయి. ఈ రంగులు సానుకూలతను, మానసిక ప్రశాంతతను పెంచుతాయి. రంగుల ఎంపికలో సౌలభ్యం, ఆనందకరమైన అనుభూతికి ప్రాధాన్యం ఇవ్వాలి. పెద్ద గదులకు డార్క్ రంగులైనా పర్లేదు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>