News July 24, 2024
ప్లేయర్లు క్రమశిక్షణతో ఉండాలి: జయసూర్య

శ్రీలంక తాత్కాలిక కోచ్గా నియమితులైన జయసూర్య ఆటగాళ్లకు క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. ప్లేయర్లంతా సరైన హెయిర్ కట్ చేయించుకోవడంతో పాటు నీట్గా ఉండాలని ఆదేశించారు. యువ ఆటగాళ్లలో క్రమశిక్షణ ముఖ్యమన్నారు. అభిమానులు ప్లేయర్లను గమనిస్తూ ఉంటారని చెప్పారు. భారత జట్టులో అనుభవజ్ఞులు రోహిత్, కోహ్లీ, జడేజా లేని అవకాశాన్ని శ్రీలంక ఉపయోగించుకోవాలని ఆటగాళ్లకు సూచించారు.
Similar News
News November 19, 2025
మహేశ్, నమ్రతల్ని కొడతా.. మంచు లక్ష్మి సరదా కామెంట్స్

తమ కుమార్తెలు సినిమాల్లోకి రాకుండా మేల్ యాక్టర్స్ నిరుత్సాహ పరుస్తున్నారని నటి మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘యాక్టర్స్ డాటర్స్’ సినిమా రంగంలో ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. మహేశ్, నమ్రతల స్టార్ కిడ్ సితారకు మంచి విజిబులిటీ ఉందన్నారు. ‘నమ్రత ప్రగతిశీల మహిళ. స్త్రీలను ఎలా పైకి తేవాలో ఆమెకు తెలుసు’ అని పేర్కొన్నారు. సితారను బయటకు తీసుకురాకుంటే వారిద్దర్నీ కొడతానని సరదాగా వ్యాఖ్యానించారు.
News November 19, 2025
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

TGలో రేపు ఉదయం 8.30 గంటల వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో తీవ్రమైన చలిగాలులు వీస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మిగతా చోట్ల సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ఈ నెల 22-24 మధ్య అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.
News November 19, 2025
హోటళ్ల యజమానుల ఇళ్లపై రైడ్స్.. భారీగా నగదు పట్టివేత

హైదరాబాద్లోని ప్రముఖ బిర్యానీ హోటళ్లు పిస్తా హౌస్, షా గౌస్ యజమానుల ఇళ్లలో జరిపిన ఐటీ <<18317664>>సోదాల్లో<<>> భారీగా నగదు, బంగారం పట్టుబడ్డాయి. 2 రోజులుగా సోదాలు నిర్వహించిన అధికారులు రూ.20 కోట్ల నగదుతో పాటు పెద్ద మొత్తంలో గోల్డ్, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లపై ఆరా తీస్తున్నారు. ఐటీ చెల్లింపులో అవకతవకల నేపథ్యంలో రైడ్స్ జరిగినట్లు సమాచారం.


