News February 8, 2025
ఆటగాళ్ల ప్రాక్టీస్.. స్టేడియం ఫుల్..!
ఇంగ్లండ్‌తో రేపు జరిగే రెండో వన్డే కోసం టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. భారత ఆటగాళ్లు నెట్ సెషన్‌లో బిజీ బిజీగా గడిపారు. కాగా తమ అభిమాన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు భారీగా ఒడిశా కటక్‌లోని బారాబతి స్టేడియానికి తరలివచ్చారు. దీంతో స్టేడియం కిక్కిరిసిపోయింది. ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండగా వారు బిగ్గరగా అరుస్తూ మద్దతిచ్చారు. ఇందుకు సంబంధించి ఫొటో SMలో వైరల్‌గా మారింది.
Similar News
News February 8, 2025
‘అఖండ-2’లో విలన్‌గా క్రేజీ యాక్టర్?
సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం సినిమాల్లో విభిన్న పాత్రలతో అలరించిన నటుడు ఆది పినిశెట్టి మరోసారి బోయపాటి శ్రీను మూవీలో విలన్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. బోయపాటి తెరకెక్కిస్తోన్న ‘అఖండ-2’లో ప్రతినాయకుడి పాత్రలో ఆది కనిపిస్తారని సినీవర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. బోయపాటి తెరకెక్కించిన ‘సరైనోడు’ సినిమాలో ఆది విలనిజంకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
News February 8, 2025
ఢిల్లీ రిజల్ట్స్: అత్యధిక మెజారిటీ ఎవరికంటే?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ(మటియా మహల్- 42,724 ఓట్లు)తో ఆప్ నేత మహమ్మద్ ఇక్బాల్ బీజేపీ అభ్యర్థి దీప్తిపై విజయం సాధించారు. మరోవైపు అత్యల్ప మెజార్టీ(344 ఓట్లు)తో సంగం విహార్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి చందన్ కుమార్ నెగ్గారు. ఓవరాల్‌గా ముగ్గురు BJP అభ్యర్థులు వెయ్యి లోపు మెజార్టీతో విజయం సాధించారు. పలు చోట్ల మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లు నోటాకే పడటం గమనార్హం.
News February 8, 2025
నెలకు రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు
246 ఉద్యోగాల భర్తీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ <