News December 18, 2024
BGT(24-25)లో అత్యధిక బాల్స్ ఆడిన ప్లేయర్లు

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ అత్యధిక బాల్స్ (463) ఎదుర్కొన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ట్రావిస్ హెడ్ (415), జైశ్వాల్ (339), స్మిత్ (262), నితీశ్ రెడ్డి (248), లబుషేన్ (238), అలెక్స్ క్యారీ (209), విరాట్ కోహ్లీ (200) ఉన్నారు. ఈ సిరీస్లో కేఎల్ రాహుల్ ఓపెనర్గా ఆడుతూ రాణిస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News November 19, 2025
లొంగిపోయేందుకు సిద్ధమైన హిడ్మా!

ఎన్కౌంటర్లో చనిపోయిన హిడ్మా నవంబర్ 10న రాసిన ఓ లేఖ వైరల్ అవుతోంది. ఛత్తీస్గఢ్లోని ఓ లోకల్ జర్నలిస్టుకు ఈ లెటర్ రాసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ‘జోహార్.. మొత్తం పార్టీ లొంగిపోయేందుకు సిద్ధంగా లేదు. సెక్యూరిటీ రిస్కులతో పాటు చాలా సమస్యలు ఉన్నాయి. మా భద్రతకు హామీ ఇస్తే ఎవరినైనా (లొంగిపోయేందుకు) కలిసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం లొకేషన్ నిర్ణయించాలి’ అని లేఖలో ఉన్నట్లు పేర్కొంది.
News November 19, 2025
50 మంది మావోయిస్టులను అరెస్టు చేశాం: లడ్డా

AP: రాష్ట్రంలో ఇప్పటివరకు 50 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నామని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా వెల్లడించారు. ‘ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అరెస్టులు జరిగాయి. భారీగా ఆయుధాలు కూడా సీజ్ చేశాం. నిన్న మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత కొందరు మావోయిస్టులు పారిపోయారు. ఛత్తీస్గఢ్/తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు’ అని తెలిపారు.
News November 19, 2025
వంటింటి చిట్కాలు

* ఫ్లాస్క్ని ఎంత శుభ్రం చేసినా దుర్వాసన వస్తుంటే మజ్జిగతో కడగాలి.
* అల్లం, వెల్లుల్లిని రుబ్బేటప్పుడు కొద్దిగా వేయిస్తే ఆ మిశ్రమం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
* వంకాయ కూర వండేటప్పుడు నిమ్మరసం పిండితే కూర రంగు మారదు. రుచి కూడా పెరుగుతుంది.
* కారం డబ్బాలో ఇంగువ వేస్తే పురుగులు పట్టవు.
* పుదీనా, కొత్తమీర చట్నీ చేసేటప్పుడు పెరుగు వేస్తే రుచి పెరుగుతుంది.


