News December 7, 2024
BGTలో షమీ ఆడటం కష్టమే!

BGTలో భారత పేసర్ షమీ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. అతనికి NCA నుంచి క్లియరెన్స్ రాకపోవడమే ఇందుకు కారణం. అతను టెస్టుల్లో బౌలింగ్ చేసేంత ఫిట్‌గా ఉన్నారా లేదా అనే దానిపై NCA టీమ్ ఇంకా క్లారిటీకి రానట్లు తెలుస్తోంది. అతడిని AUSకు పంపకపోవచ్చని, పంపినా చివరి టెస్టులో మాత్రమే ఆడతారని BCCI వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం SMAT T20లో బెంగాల్ తరఫున ఆడుతున్నారు. ఎల్లుండి చండీగఢ్‌తో బెంగాల్ ప్రీ QF ఆడనుంది.
Similar News
News November 24, 2025
అది మీ తప్పు కాదు

ప్రేమలో విఫలం అయిన తర్వాత చాలామంది తమ లోపాల వల్లే అలా అయిందని బాధపడుతుంటారు. ఇలాంటి ప్రతికూల ఆలోచనలు డిప్రెషన్‌కు కారణమవుతాయంటున్నారు నిపుణులు. వాళ్ల ఆలోచనలు, గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడం సరికాదు. సానుకూల దృక్పథం, స్వీయ ప్రేమను అలవర్చుకొని జీవితంలో ముందుకు సాగాలి. ఎంత ప్రయత్నించినా బాధ నుంచి బయటపడలేకపోతుంటే మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది.
News November 24, 2025
ముగిసిన ఐబొమ్మ రవి విచారణ.. కీలక విషయాలు వెలుగులోకి!

మూవీ పైరసీ కేసులో ఐబొమ్మ రవి 5 రోజుల పోలీసు విచారణ ముగిసింది. స్నేహితుడు నిఖిల్‌తో కలిసి రవి డేటా హ్యాండ్లింగ్, సర్వర్ యాక్సెస్ వంటి అంశాల్లో పాల్గొన్నట్లుగా సమాచారం. టెలిగ్రామ్ యాప్ ద్వారా పైరసీ సినిమాల కొనుగోలు, USDT చెల్లింపులు, APK లింక్స్‌తో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసినట్లు తెలుస్తోంది. విచారణ ముగిశాక రవిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు.
News November 24, 2025
కొడంగల్ వేదికగా స్థానిక ప్రచారం మొదలెట్టిన సీఎం

TG: 3-4 రోజుల్లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల ప్రచారాన్ని తన సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి ప్రారంభించారు. ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని, మహిళలు ఆ చీరలు కట్టుకొని అభివృద్ధికి అండగా నిలిచే వారికి ఓటేయాలన్నారు. పదేళ్లు అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కాగా త్వరలోనే 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు SEC షెడ్యూల్ విడుదల చేయనుంది.


