News August 1, 2024
గర్భంతో క్రీడల్లో పాల్గొనడం కొత్తేమీ కాదు!

ఏడు నెలల గర్భంతో ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఈజిప్టు ఫెన్సర్ నడా హఫీజ్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇలా గర్భంతో ఉన్నవారు క్రీడల్లో పాల్గొనడం కొత్తేమీ కాదు. 2017లో సెరెనా విలియమ్స్ గర్భిణిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచారు. 2014లో అల్సియా మోంటానో(USA) గర్భిణిగా ఉండి 800 మీటర్ల రేస్‌లో పాల్గొన్నారు. అయితే పోడియంలో ఇద్దరికి బదులు ఈసారి ముగ్గురం పాల్గొన్నామని నడా హఫీజ్ చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరలవుతోంది.
Similar News
News November 13, 2025
హైదరాబాద్ మెట్రో: 4, 6 కోచ్‌లతో రైళ్లు!

TG: హైదరాబాద్ మెట్రోలో రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో 4, 6 కోచ్‌ల రైళ్లను ప్రవేశపెట్టాలని HMRL యోచిస్తోంది. ఇందుకోసం 40-60 కోచ్‌లను తీసుకురానున్నట్లు HMRL ఎండీ సర్ఫరాజ్ తెలిపారు. ప్రస్తుతం 3 మార్గాల్లో 3 కోచ్‌లతో 56 రైళ్లు తిరుగుతున్నాయని పేర్కొన్నారు. వీటిలో ఎలాంటి మార్పులు చేయకుండా కొత్తగా 4, 6 కోచ్‌లతో ట్రైన్లను తీసుకొస్తామని వివరించారు. ఇందుకు రెండేళ్లకు పైగా సమయం పట్టొచ్చని చెప్పారు.
News November 13, 2025
ఒక్క జూమ్ కాల్‌తో ₹1.35లక్షల కోట్ల పెట్టుబడి: లోకేశ్

AP: ₹1.35లక్షల కోట్ల పెట్టుబడి పెట్టే ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను కేవలం జూమ్ కాల్‌తో రప్పించామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. విశాఖలో 5 సంస్థలకు ఆయన భూమిపూజ చేశారు. గూగుల్ AI హబ్‌కు నెలాఖరున శంకుస్థాపన చేస్తామని తెలిపారు. TCS, కాగ్నిజెంట్ సహా అనేక ఐటీ జెయింట్స్ రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. 2026 జూన్‌కు భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి అంతర్జాతీయ కనెక్టివిటీ ప్రారంభమవుతుందని వివరించారు.
News November 13, 2025
SSC ఫీజు గడువు NOV 20 వరకు పొడిగింపు

TG: టెన్త్ పరీక్షల ఫీజు గడువును నవంబర్ 20 వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. నవంబర్ 21 నుంచి 29 వరకు ₹50, డిసెంబర్ 2 నుంచి 11 వరకు ₹200, 15 నుంచి 29 వరకు ₹500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. రెగ్యులర్, ఫెయిల్ అభ్యర్థులు 2026 మార్చిలో జరిగే ఈ పరీక్షలకు ఫీజు చెల్లించాలంది. గడువు లోపు రూ.125 ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.


