News August 21, 2025
PLEASE CHECK: అకౌంట్లలో డబ్బులు పడ్డాయా?

AP: ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వల్ల ‘అన్నదాత సుఖీభవ’ లబ్ధి పొందని 1,04,107 మంది రైతుల ఖాతాల్లో నిన్న డబ్బులు జమ అయ్యాయి. వారితో పాటు ఈ-కేవైసీ, NPCI క్రమబద్ధీకరించుకున్న మరో 38,658 మందికి రూ.5వేల చొప్పున మంత్రి అచ్చెన్నాయుడు రూ.71.38 కోట్లు విడుదల చేశారు. ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయో? లేదో? ఈ <
Similar News
News August 21, 2025
బాంబ్ సందేశం తెచ్చిన పావురం.. జమ్మూలో హైఅలర్ట్

భారత్-పాక్ సరిహద్దులోని ఆర్ఎస్ పురా ప్రాంతంలో ఓ పావురం కలకలం రేపింది. దాని కాలికి రానున్న రోజుల్లో ‘జమ్మూ స్టేషన్‌ను ఐఈడీతో బ్లాస్ట్ చేస్తాం’ అని రాసి ఉండటాన్ని BSF బలగాలు గుర్తించాయి. అలాగే ‘కశ్మీర్ మాది’ అనే స్లోగన్ సైతం ఉండటంతో జమ్మూలో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. జమ్మూ రైల్వే స్టేషన్‌ను తమ అధీనంలోకి తీసుకున్నాయి.
News August 21, 2025
ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ

TG: రాజకీయ కారణాలతోనే తనను TBGKS గౌరవాధ్యక్ష పదవి నుంచి తొలగించారని MLC కవిత సింగరేణి కార్మికులకు లేఖ రాశారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నేను కార్మికుల తరఫున పోరాడుతుంటే కొందరు నాపై కుట్రలు చేస్తున్నారు. గతంలోనూ నేను US పర్యటనలో ఉన్నప్పుడే KCRకు రాసిన లేఖ లీక్ చేశారు. ఇప్పుడు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కొత్త గౌరవాధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ఆ కుట్రదారులు నన్ను వేధిస్తున్నారు’ అని ఆరోపించారు.
News August 21, 2025
SEP 26,27,28 తేదీల్లో సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్

AP: బాపట్ల (D) సూర్యలంక బీచ్‌లో SEP 26, 27, 28 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా 3రోజుల పాటు సాంస్కృతిక, క్రీడా, వినోద కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రపంచ టూరిజం దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 27న CM చంద్రబాబు సూర్యలంక బీచ్‌లో పర్యటించనున్నారు. అదే రోజు రూ.97 కోట్లతో బీచ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ జె.వెంకట మురళీ సమీక్ష నిర్వహించారు.