News October 31, 2024

PLEASE CHECK.. ఈ జాబితాలో మీ పేరు ఉందా?

image

APలో ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 4.14 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 2.03 కోట్ల మంది పురుషులు, 2.10 కోట్ల మంది మహిళలు, థర్డ్ జెండర్ 3394 మంది ఉన్నారు. ఈ ఓటరు జాబితాపై నవంబర్ 28 వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. మార్పులు, చేర్పుల అనంతరం జనవరి 6న తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News October 31, 2024

మహారాష్ట్ర ఎన్నికల్లో BRS పోటీపై KTR స్పందన

image

మహారాష్ట్రలో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో BRS పోటీ చేస్తుందా? అన్న ప్రశ్నకు #AskKTRలో KTR వివరించారు. ‘ప్రస్తుతం మా ఫోకస్ మొత్తం మా సొంత రాష్ట్రం తెలంగాణపైనే ఉంది’ అని బదులిచ్చారు. అటు HYDలో నెలరోజులు 144 సెక్షన్ పెట్టడం షాకింగ్ అంశమని, రాష్ట్రాభివృద్ధి విషయంలో కాంగ్రెస్ డిజాస్టర్ అని ఆయన నెటిజన్ల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.

News October 31, 2024

BPL ఫౌండర్ గోపాలన్ నంబియార్ మృతి

image

భార‌త ఎల‌క్ట్రానిక్ కంపెనీ బీపీఎల్ గ్రూప్ వ్య‌వ‌స్థాప‌కులు టీపీ గోపాల‌న్ నంబియార్ (94) క‌న్నుమూశారు. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గురువారం ఉద‌యం 10.15 గంట‌ల‌కు తుదిశ్వాస విడిచిన‌ట్టు ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు. నంబియార్ మృతిపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సంతాపం వ్య‌క్తం చేశారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ బ‌లోపేతాన్ని బ‌లంగా కాంక్షించిన పారిశ్రామికవేత్త అని కొనియాడారు.

News October 31, 2024

మ‌హారాష్ట్ర త‌దుప‌రి సీఎం ఫ‌డ్న‌వీస్: రాజ్ థాక్రే

image

దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌ త‌దుప‌రి మ‌హారాష్ట్ర CM అవుతార‌ని MNS చీఫ్ రాజ్ థాక్రే జోస్యం చెప్పారు. ఎన్నిక‌ల త‌రువాత MNS, BJP క‌లుస్తాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. దీనిపై శివ‌సేన UBT MP సంజ‌య్ రౌత్ స్పందిస్తూ కుమారుడు అమిత్ థాక్రే భ‌విష్య‌త్తుపై ఆందోళ‌న‌తోనే రాజ్ BJP జ‌పం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. మోదీ, అమిత్ షాల‌ను MHలో అనుమ‌తించ‌కూడ‌ద‌న్న వ్య‌క్తే ఈ రోజు BJPని పొగుడుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.