News February 14, 2025

PLEASE CHECK.. ఈ లిస్టులో మీ పేరు ఉందా?

image

TG: ఇందిరమ్మ గృహాల కోసం అర్హుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించగా, ఇల్లు మంజూరైందా? లేదా? అని తెలియక లబ్ధిదారుల్లో కొంత ఆందోళన నెలకొంది. అలాంటి వారంతా తమ ఫోన్, ఆధార్, అప్లికేషన్, రేషన్ కార్డు నంబర్లలో ఏదైనా ఒకటి ఎంటర్ చేసి అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. సర్వే కంప్లీట్ అయ్యిందా? ఏ జాబితా(L-1,2,3)లో ఇల్లు మంజూరైంది? అనే వివరాలు దీనిలో వస్తాయి. తెలుసుకోవడానికి ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News January 11, 2026

నిర్మలా సీతారామన్‌కు భట్టి విక్రమార్క కీలక విజ్ఞప్తి

image

TG: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలను తీర్చడానికి బహిరంగ మార్కెట్ ద్వారా రూ.70,925 కోట్లు సమీకరించుకునే అనుమతి ఇవ్వాలని Dy.CM భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టుల కోసం వివిధ ఏజెన్సీల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంది. స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) కింద ఉన్న ఈ రుణాలను FRBM పరిధిలోకి తీసుకురావాలని అభ్యర్థించారు.

News January 11, 2026

పాకిస్థాన్‌కు యుద్ధం చేసే ధైర్యం లేదు: మనోజ్ కటియార్

image

ఇండియాతో నేరుగా యుద్ధం చేసే ధైర్యం పాకిస్థాన్‌కు లేదని వెస్టర్న్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కటియార్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఉగ్రవాదమే పాక్ ఏకైక ఆయుధమని, పరోక్ష యుద్ధంతోనే భారత్‌ను అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. మానెక్‌షా సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ సరిహద్దులో ఉద్రిక్తతలకు అవకాశం ఉందని హెచ్చరించారు. భారత సైన్యం బలం భిన్నత్వంలో ఏకత్వమని అన్నారు.

News January 11, 2026

నితీశ్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్

image

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. కేంద్ర మంత్రులు జితన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాశ్వాన్‌లు ఈ మేరకు బహిరంగంగా మద్దతు తెలిపారు. రెండు దశాబ్దాలుగా బిహార్ అభివృద్ధికి నితీశ్ చేసిన కృషి ఆయనను భారతరత్నకు అర్హుడిని చేస్తుందని వారు పేర్కొన్నారు. ఇదే సమయంలో జేడీయూ నేత కేసీ త్యాగి సైతం ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.