News October 8, 2025
దయచేసి మాకు పోటీగా రాకండి: గ్రూప్-3 ర్యాంకర్లు

TG: గ్రూప్-2 ఉద్యోగానికి ఎంపికైన వారు తమకు పోటీగా రావొద్దని గ్రూప్-3కి క్వాలిఫై అయిన ర్యాంకర్లు కోరారు. వెబ్ ఆప్షన్, సర్టిఫికెట్ల పరిశీలనకు దూరంగా ఉండాలని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వేడుకున్నారు. గ్రూప్3 పోస్టులకు ఎంపికైన గ్రూప్2 అభ్యర్థులు 500 మంది ఉన్నారని, అధ్యాపకులు, SIలు మరో 600 మంది ఉన్నారని తెలిపారు. వీరు కోర్టు కేసుల నేపథ్యంలో గ్రూప్3 పోస్టులను బ్యాకప్ ఆప్షన్‌గా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News October 8, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,150 పెరిగి తొలిసారి రూ.1,23,170కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.1,050 ఎగబాకి రికార్డు స్థాయిలో రూ.1,12,900 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.100 తగ్గి రూ.1,67,000కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News October 8, 2025
కాంతార చాప్టర్-1కు రూ.400 కోట్ల కలెక్షన్లు

గత గురువారం విడుదలైన ‘కాంతార చాప్టర్-1’ భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటివరకు రూ.400 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఈ మార్క్ అందుకున్న నాలుగో సినిమాగా (సైయారా, ఛావా, కూలీ) నిలిచింది. నెట్ కలెక్షన్లు రూ.290 కోట్లుగా ఉండొచ్చని, ఇవాళ్టితో హిందీ మార్కెట్లో రూ.100 కోట్ల నెట్ దాటుతుందని అంచనా వేస్తున్నారు. తెలుగులో రూ.57.40 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి.
News October 8, 2025
సరైన భాగస్వామి దొరికే వరకు ఎదురుచూడటంలో తప్పులేదు: ఉపాసన

NCRB ప్రకారం భారత్‌లో సగం నేరాలకు వైవాహిక సమస్యలు కూడా కారణమంటున్నారు ఉపాసన. కాబట్టి పెళ్లి విషయంలో మహిళల ఆలోచనా తీరుమారాలని సూచిస్తున్నారు. భాగస్వామి ఎంపికలో సరైన నిర్ణయమే మహిళ భవిష్యత్తుకి, మంచి కుటుంబాన్ని నిర్మించడానికి కీలకమన్నారు. డబ్బు, హోదా కోసం పెళ్లి చేసుకోకూడదని, మీకు గౌరవమిస్తూ అన్ని విషయాల్లో అండగా నిలిచే వ్యక్తి కోసం ఎదురుచూడటంలో తప్పులేదని ఓ పోస్టులో పేర్కొన్నారు.