News March 30, 2025

ప్లీజ్.. Ghibli వాడకం తగ్గించండి: ఓపెన్ ఏఐ సీఈవో

image

ట్రెండింగ్‌లో ఉన్న <<15920719>>Ghibli వాడకాన్ని<<>> తగ్గించాలని ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ యూజర్లకు విజ్ఞప్తి చేశారు. వాడకం ఎక్కువగా ఉందని, యూజర్లు కాస్త కూల్‌గా ఉండాలన్నారు. తమ సిబ్బందికి నిద్ర కూడా అవసరమని దయచేసి వాడకం తగ్గించాలని కోరారు. కాగా రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి నెటిజన్ల వరకు Ghibli వాడుతున్నారు.

Similar News

News April 1, 2025

ఈ నెలలోనే మెగా DSC నోటిఫికేషన్: సీఎం చంద్రబాబు

image

AP: ఏప్రిల్ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారు. జూన్‌లో స్కూళ్లు ప్రారంభమయ్యేలోగా టీచర్ల నియామకం పూర్తి చేస్తామన్నారు. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తామని తెలిపారు. అన్నదాత-సుఖీభవ కింద రూ.20వేలు ఇస్తామని పేర్కొన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఏపీలో కంటే తక్కువ పెన్షన్ ఇస్తున్నారని అన్నారు.

News April 1, 2025

మీరు ఫూల్ అయ్యారా ఫ్రెండ్స్!

image

మన స్కూల్ డేస్‌లో ఏప్రిల్ 1 వస్తుందంటే ఎవరిని ఎలా ఫూల్ చేయాలా అని ప్లాన్ చేసేవాళ్లం. ఇక ఆ రోజు.. గోడమీద బల్లి, నీ డ్రెస్‌పై ఏదో పడింది, మీ వాళ్లు వస్తున్నారు, నిన్ను పిలుస్తున్నారు.. అని ఆ ఏజ్‌లో మనలోని చాణక్య చతురతతో అవతలి వారిని నమ్మించి ‘ఏప్రిల్ ఫూల్..’ అని ఆనందించాం. ఇప్పుడు నిజ జీవితంలో కొందరి చేతిలో ఫూల్ అవుతున్నాం.. అది వేరే అనుకోండి. ఫూల్స్ డేతో మీకున్న మెమోరీస్, ఫీలింగ్స్ కామెంట్ చేయండి.

News April 1, 2025

దుమ్మురేపుతున్న ‘మ్యాడ్ స్క్వేర్’ కలెక్షన్లు

image

‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ కలెక్షన్లలో అదరగొడుతోంది. ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.69.4 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ‘థియేటర్లలో నవ్వులు.. థియేటర్ల బయట హౌస్ ఫుల్ బోర్డులు’ అని రాసుకొచ్చింది. MADకు సీక్వెల్‌గా కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

error: Content is protected !!