News July 5, 2024
రాష్ట్రాన్ని ఆదుకోండి.. నిర్మలకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

AP: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని, అభివృద్ధికి సహకరించాలని కోరారు. పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు రామ్మోహన్, పెమ్మసాని చంద్రశేఖర్, NDA ఎంపీలు పాల్గొన్నారు. మరికొందరు కేంద్రమంత్రులతోనూ సీఎం నేడు భేటీ కానున్నారు.
Similar News
News November 21, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 11

62. డంభం అంటే ఏమిటి? (జ.తన గొప్ప తానే చెప్పుకోవటం)
63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (జ.తన భార్యలో, తన భర్తలో)
64. నరకం అనుభవించే వారెవరు? (జ.ఆశపెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితృదేవతల్నీ ద్వేషించేవాడు, దానం చెయ్యనివాడు)
65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (జ.ప్రవర్తన మాత్రమే)
66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (జ.మైత్రి)
<<-se>>#YakshaPrashnalu<<>>
News November 21, 2025
OFFICIAL: రెండో టెస్టుకు కెప్టెన్గా పంత్

గువాహటి వేదికగా రేపటి నుంచి సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్టుకు కెప్టెన్ గిల్ దూరమైనట్లు BCCI ప్రకటించింది. దీంతో జట్టుకు పంత్ నాయకత్వం వహించనున్నట్లు వెల్లడించింది. మెడకు గాయం కారణంగా తొలి టెస్టులోనూ గిల్ బ్యాటింగ్ చేయలేకపోయిన విషయం తెలిసిందే. చికిత్స తర్వాత గువాహటికి వెళ్లినప్పటికీ క్రికెట్ ఆడేందుకు అతను ఫిట్గా లేడని BCCI తెలిపింది. మరిన్ని టెస్టులు, చికిత్స కోసం ముంబై వెళ్తున్నట్లు పేర్కొంది.
News November 21, 2025
ఏపీ సచివాలయం వద్ద భద్రత పెంపు

AP: రాష్ట్రంలో మావో అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్, మరో 51 మంది మావోయిస్టులు అరెస్టయిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెలగపూడి సచివాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే ఉద్యోగుల ఐడీ కార్డులను పరిశీలించిన తర్వాతే లోపలికి పంపుతున్నారు. విజయవాడ పరిసరాల్లో మరింత మంది మావోలు ఉండొచ్చనే సమాచారంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.


