News January 6, 2025
ఇకనైనా మాస్కులు పెట్టుకోండి గురూ!
చైనాను వణికించిన వైరస్ మన దగ్గరకు ఎందుకు వస్తుందిలే అనుకోవడంతోనే ఐదేళ్ల క్రితం కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఇప్పుడు చైనాలో HMPV కేసులు పెరుగుతుండటంతో INDకు వచ్చేందుకు టైమ్ పడుతుందిలే అని అంతా భావించారు. కానీ అవే లక్షణాలతో BNGLRలో 8నెలల చిన్నారి ఆస్పత్రిలో చేరింది. కాబట్టి ఇప్పటి నుంచే బయటకెళ్లినప్పుడు మాస్కులు ధరించండి. చేతులు శుభ్రంగా కడుక్కోండి. షేక్ హ్యాండ్స్ ఇవ్వకండి. SHARE IT
Similar News
News January 7, 2025
కొత్త పథకం ప్రకటించిన కేంద్ర మంత్రి
రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లో పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత బాధితులకు చికిత్స ఖర్చుల నిమిత్తం రూ.1.5 లక్షలు కేంద్రం తక్షణమే అందజేస్తుందని తెలిపారు. హిట్ అండ్ రన్ కేసులో మరణిస్తే రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని తెలిపారు.
News January 7, 2025
ఇలా చేస్తే HAPPY LIFE మీ సొంతం
ఉరుకుల పరుగుల జీవితంలో కొన్ని విషయాల్లో నియంత్రణ అవసరం. జీవితాన్ని ఉత్తమంగా మార్చేందుకు ఈ 5Mను కంట్రోల్లో ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. *MOUTH-ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించాలి. *MIND-ప్రతి విషయంలో సానుకూల దృక్పథంతో ఉండాలి. *MANNER- మర్యాదపూర్వక ప్రవర్తన. *MOOD- భావోద్వేగాల నియంత్రణ. *MONEY- ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ వంటివి పాటిస్తే జీవితం మెరుగ్గా ఉంటుందని సూచిస్తున్నారు.
News January 7, 2025
తెలంగాణ హైకోర్టు సీజే బదిలీకి సిఫార్సు
తెలంగాణ హైకోర్టు సీజే అలోక్ అరాధే బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఆయనను బాంబే హైకోర్టు సీజేగా బదిలీ చేయాలని ప్రతిపాదించింది. 2023 జులైలో రాష్ట్ర హైకోర్టు సీజేగా అలోక్ నియమితులయ్యారు. మరోవైపు బాంబే హైకోర్టు సీజే దేవేంద్ర కుమార్ను ఢిల్లీ HCకి బదిలీ చేయాలని సిఫార్సు చేసింది.