News August 20, 2024
పాక్ దుస్థితి: స్టేడియాల్లో నో బాత్రూమ్స్.. నో సీట్స్

పాకిస్థాన్ స్టేడియాలు అంతర్జాతీయ ప్రమాణాలకు ఆమడ దూరంలో ఉన్నాయని PCB ఛైర్మన్ మోహిసిన్ నఖ్వీ అంగీకరించారు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 లోపు వీటిని పునరుద్ధరించడం సులభమేమీ కాదన్నారు. ‘ఒక్క స్టేడియమైనా అంతర్జాతీయ స్థాయికి తగినట్టు లేదు. సీట్లు లేవు. బాత్రూమ్లు లేవు. అర కిలోమీటర్ దూరం నుంచి మ్యాచ్ చూస్తున్న ఫీలింగ్. గఢాపీ స్టేడియాన్ని కీలక మ్యాచులకు సిద్ధం చేస్తాం’ అని ఆయన అన్నారు.
Similar News
News November 20, 2025
పోలి పాడ్యమి కథ వింటే కలిగే ఫలితాలివే..

పోలి పాడ్యమి రోజున నిష్ఠతో దీపారాధన చేసి, పోలి స్వర్గం కథను శ్రద్ధగా వింటే ఈ శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం.
☞ ఈ ఒక్క రోజు పూజతో కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యం సిద్ధిస్తుంది. ☞ స్వర్గ ప్రాప్తి మార్గం సుగమం అవుతుంది. ☞ మానసిక శాంతి, ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతాయి. ☞ కుటుంబంలో సౌఖ్యం, సమృద్ధి పెరిగి, లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. ☞ భక్తి, శ్రద్ధల మూలంగా ఈ గొప్ప ఫలాలు అందడం మన అదృష్టం.
News November 20, 2025
4,116 పోస్టులకు నోటిఫికేషన్

<
News November 20, 2025
పండ్ల తోటల్లో పిందె/కాయలు రాలకుండా ఉండాలంటే?

పిందె, కాయలు ఎదిగే దశల్లో, పోషక లోపాల నివారణ కోసం, సూక్ష్మ, స్థూల పోషకాలను అందించాలి. కాయ ఎదుగుతున్న దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. పండ్ల తోటలను ఆశించే పురుగులు, తెగుళ్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నివారణ చర్యలను పాటించాలి. అధిక సంఖ్యలో పిందెలు ఏర్పడితే బలహీనమైన, తక్కువ పరిమాణంలో ఉన్న పిందెలను తీసేస్తే పోషకాలు సమానంగా అంది రాలడం తగ్గుతుంది. పండు ఈగ కట్టడికి మిథైల్ యూజినాల్ ఎర వాడాలి.


