News January 21, 2025
PM అవార్డ్స్ కోసం ప్రతిపాదనలు పంపండి: ప్రకాశం కలెక్టర్

పీఎం అవార్డ్స్ కోసం తగిన ప్రతిపాదనలతో వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలపై మంగళవారం ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 2022 ఏప్రిల్ నెల నుంచి 2024 డిసెంబరు నెలాఖరు వరకు వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన వివరాలతో సమగ్ర నివేదికలను రూపొందించాలని అధికారులకు ఆమె దిశానిర్దేశం చేశారు.
Similar News
News February 8, 2025
MP మాగుంటకు మరో కీలక పదవి

జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (ZRUCC) మెంబెర్‌గా ఒంగోలు MPమాగుంట శ్రీనివాసులురెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీ మాగుంట ఇప్పటికే కేంద్ర పట్టణ, గృహ వ్యవహారాల శాఖ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
News February 8, 2025
ఒంగోలు: తాగునీటికి ఇబ్బంది కలగకుండా చూడాలి: కలెక్టర్

వేసవి దృష్ట్యా జిల్లాలో ఎక్కడ తాగునీటికి ఇబ్బంది కలగకుండా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అన్సారియా స్పష్టం చేశారు. ఒంగోలులోని కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో కలెక్టర్, జేసీతో కలిసి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాలు, వార్డుల వారీగా అందుబాటులో ఉన్న నీటి వనరులను గుర్తించడంతో పాటు, ఏప్రిల్ నెల వరకు ఎంత మేర నీరు అవసరమో వాటర్ ఆడిట్ నిర్వహించాలని సూచించారు.
News February 8, 2025
ఐ లవ్ ఒంగోలు అంటూ RGV ట్వీట్

ఒంగోలు పోలీస్ స్టేషన్లో విచారణ అనంతరం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘ఐ లవ్ ఒంగోల్. ఐ లవ్ ఒంగోల్ పోలీస్ ఈవెన్ మోర్. 3 ఛీర్స్’ అంటూ పెగ్గుతో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్‌లో ఫొటోలను మార్ఫింగ్ కేసులో ఆయన విచారణ నిమిత్తం ఒంగోలు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన విషయం తెలిసిందే.