News November 29, 2024

PM వెళ్లి బిర్యానీ తినొచ్చు కానీ టీమ్ ఇండియా వెళ్లొద్దా?: తేజస్వీ

image

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం క్రికెట్ జట్టును పాకిస్థాన్‌కు భారత్ పంపకపోవడంపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. క్రీడల్లో రాజకీయాలుండకూడదని పేర్కొన్నారు. ‘పాక్ ఆటగాళ్లు మన దేశానికి రావాలి. మన వాళ్లు అక్కడికి వెళ్లాలి. క్రీడల్లో యుద్ధమేం జరగడం లేదు కదా? పీఎం మోదీ పాకిస్థాన్ వెళ్లి బిర్యానీ తిన్నప్పుడు లేని అభ్యంతరం, మన జట్టును అక్కడికి పంపించడానికెందుకు?’ అని ప్రశ్నించారు.

Similar News

News December 3, 2025

విశాఖలో 12 నుంచి కాగ్నిజెంట్ కార్యకలాపాలు

image

AP: ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ విశాఖలో ఈ నెల 12 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ప్రస్తుతం ఐటీ పార్కులోని తాత్కాలిక భవనంలో తన సెంటర్ ఏర్పాటు చేయనుంది. అదే రోజు కాపులుప్పాడలో ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. 2028 జూన్ నాటికి తొలి దశ నిర్మాణాలు పూర్తవుతాయని సమాచారం.

News December 3, 2025

పెళ్లి కాని వారు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించవచ్చా?

image

పెళ్లికాని వారు కూడా సత్యనారాయణస్వామి వ్రతాన్ని నిరభ్యంతరంగా ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు. సాయంత్రం వేళలో చేసే ఈ వ్రతానికి అధిక ఫలితం ఉంటుందని అంటున్నారు. ‘ఈ వ్రతాన్ని ఇంట్లోనే కాకుండా ఆలయాలు, నదీ తీరాలు, సాగర సంగమాల వద్ద కూడా చేసుకోవచ్చు. స్వామివారి కథ విన్నా కూడా శుభం జరుగుతుంది. ఇంట్లో ఏదైనా అశుభం జరిగినప్పుడు, సూతకం వంటివి ఉన్నప్పుడు వ్రతాన్ని చేయకపోవడం మంచిది’ అంటున్నారు.

News December 3, 2025

763 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల

image

DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్(CEPTAM) 763 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B, టెక్నీషియన్-A పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిసెంబర్ 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ త్వరలో విడుదల కానుంది. వెబ్‌సైట్: https://www.drdo.gov.in