News July 30, 2024

మనూ భాకర్‌ను అభినందించిన PM, AP CM

image

పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత షూటర్ మనూ భాకర్‌ను PM మోదీ, ఏపీ CM చంద్రబాబు అభినందించారు. ఈ విజయం ఆమె అంకిత భావానికి నిదర్శమని మోదీ ప్రశంసించారు. 10M ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ విభాగంలో సరబ్‌జోత్‌తో కలిసి మనూ కాంస్యం గెలవడం అభినందనీయమన్నారు. అటు 124ఏళ్ల చరిత్రలో ఓ భారత ఒలింపియన్ ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించడం ఇదే తొలిసారి అని CBN కొనియాడారు.

Similar News

News December 30, 2025

సూర్యకుమార్ మెసేజ్‌ చేసేవాడు.. బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు!

image

టీమ్ ఇండియా T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ‘MTV స్ప్లిట్స్‌విల్లా’ ఫేమ్ ఖుషీ ముఖర్జీ షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో సూర్య తనకు తరచూ మెసేజ్‌ చేసేవాడని తెలిపారు. ప్రస్తుతం ఇద్దరం మాట్లాడుకోవడం లేదని చెప్పారు. ఏ క్రికెటర్‌తోనైనా డేటింగ్ చేయాలనుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. తన వెనుక చాలామంది పడుతున్నారని.. కానీ తాను ఎవరితోనూ అసోసియేట్ అవ్వాలనుకోవడం లేదని అనడం ఇప్పుడు SMలో వైరల్‌గా మారింది.

News December 30, 2025

సంక్రాంతికి మరో 11 స్పెషల్ ట్రైన్స్: SCR

image

సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 11 స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) ప్రకటించింది. జనవరి 7 నుంచి జనవరి 12 మధ్య ఇవి రాకపోకలు సాగించనున్నాయి. కాకినాడ టౌన్‌-వికారాబాద్‌, వికారాబాద్‌-పార్వతీపురం, పార్వతీపురం-వికారాబాద్‌, పార్వతీపురం-కాకినాడ టౌన్‌, సికింద్రాబాద్‌-పార్వతీపురం, వికారాబాద్‌-కాకినాడ మధ్య ఈ ట్రైన్స్ నడవనున్నాయి. వీటికి బుకింగ్స్‌ ప్రారంభమైనట్లు తెలిపింది.

News December 30, 2025

రూ.100 కోట్లు డొనేట్ చేసిన పూర్వ విద్యార్థులు

image

IIT కాన్పూర్ చరిత్రలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. 2000 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఏకంగా రూ.100కోట్ల విరాళం అందించారు. సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈ విరాళాన్ని ప్రకటించి.. ప్రొఫెసర్లు, విద్యాసంస్థ పట్ల తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఈ డబ్బులతో ‘మిలీనియం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సొసైటీ’ ఏర్పాటు చేయనున్నారు. ఇన్‌స్టిట్యూట్‌కి ఒకే బ్యాచ్ స్టూడెంట్స్ ఇంత మొత్తంలో విరాళం ఇవ్వడం ఇదే మొదటిసారి.