News October 13, 2024
PM గతిశక్తి ఓ గేమ్ ఛేంజర్: మోదీ

రైల్వే నుంచి విమానాశ్రయాల వరకు 7 కీలక రంగాల సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా ‘PM గతిశక్తి’ దేశ మౌలిక సదుపాయాల రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. మల్టీమోడల్ కనెక్టివిటీ పెరిగి వివిధ రంగాల్లో సమర్థవంతమైన పురోగతికి తోడ్పడిందన్నారు. రవాణా వ్యవస్థ మెరుగుపడి ఆలస్యం తగ్గిందని, తద్వారా ఎంతో మంది కొత్త అవకాశాలను అందిపుచ్చుకున్నారని మోదీ పేర్కొన్నారు.
Similar News
News January 1, 2026
TODAY HEADLINES

✦ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న TG CM రేవంత్
✦ ఉద్యోగులకు రూ.713 కోట్లు విడుదల చేసిన TG సర్కార్
✦ గోదావరి నీటి మళ్లింపును అంగీకరించం: ఉత్తమ్
✦ APలో పెరుగుతున్న స్ర్కబ్ టైఫస్ కేసులు.. ఇప్పటివరకు 2 వేలకుపైగా నమోదు, 22మంది మృతి
✦ పెయిన్‌కిల్లర్ డ్రగ్ Nimesulide తయారీ, సేల్స్‌పై బ్యాన్: కేంద్రం
✦ కోమాలోకి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్టిన్
News January 1, 2026
ట్రైనీ కానిస్టేబుళ్లకు రూ.12వేలు.. ఉత్తర్వులు జారీ

AP: ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్‌ను రూ.4,500 నుంచి రూ.12వేలకు పెంచుతూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16న మంగళగిరిలో జరిగిన నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్టైఫండ్‌ను పెంచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమం రెండు దశల్లో 9 నెలలపాటు జరగనుంది.
News January 1, 2026
40’s తర్వాత నిద్ర తగ్గితే ఏం జరుగుతుందో తెలుసా?

40 ఏళ్ల తర్వాత శరీరానికి 7-9 గంటల నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. 7గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతే టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. మెదడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. రోగనిరోధక శక్తి తగ్గుదలతోపాటు రోజువారీ కార్యకలాపాలకు బాడీ నెమ్మదిగా స్పందిస్తుంది. విటమిన్ డెఫిషియన్సీ, ప్రీ డయాబెటిస్, థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత సమస్యలు వచ్చే ప్రమాదముంది.


