News February 24, 2025
నేడు పీఎం కిసాన్ నిధుల విడుదల

ప్రధాని మోదీ నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నారు. బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ఆయన 19వ విడత కింద దేశంలోని రైతులకు రూ.22వేల కోట్ల నిధులను విడుదల చేస్తారు. రైతులకు ఏడాదిలో ఒక్కో విడతలో రూ.2వేలు చొప్పున 3 విడతల్లో కేంద్రం రూ.6వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. 2019లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 18 విడతల్లో రూ.3.46లక్షల కోట్లు చెల్లించారు.
Similar News
News February 24, 2025
తిరుమల శ్రీవారి టికెట్లు విడుదల

AP: తిరుమల శ్రీవారి మే నెల కోటా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల(రూ.300)ను టీటీడీ విడుదల చేసింది. అలాగే, మధ్యాహ్నం 3 నుంచి తిరుమల, తిరుపతిలో గదుల కోటా టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను అధికారిక సైట్‌లోనే బుక్ చేసుకోవాలని <
News February 24, 2025
అసెంబ్లీకి చేరుకున్న చంద్రబాబు, జగన్

AP: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సభకు హాజరయ్యారు. కాసేపట్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. చాలా రోజుల తర్వాత జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరవుతుండటంతో ఆసక్తి నెలకొంది.
News February 24, 2025
కోహ్లీ రికార్డుకు ముడిపెడుతూ కేసీఆర్‌పై మంత్రి సెటైర్లు

TG: భారత క్రికెటర్ కోహ్లీ రికార్డుకు, BRS చీఫ్ కేసీఆర్‌కు ముడిపెడుతూ మంత్రి కొండా సురేఖ ఆసక్తికర ట్వీట్ చేశారు. 14వేల పరుగులతో కోహ్లీ రికార్డు బద్దలు కొడితే.. ప్రతిపక్ష నేతగా 14 నెలల్లో 14 రోజులు కూడా సభకు రాకుండా KCR రికార్డు నెలకొల్పారని సెటైర్లు వేశారు. పరుగులతో విరాట్ వార్తల్లో నిలిస్తే 14 నెలలుగా విరాట పర్వం వీడని గులాబీ బాస్ వార్తల్లోకి ఎక్కడం ఆలోచించాల్సిన విషయం కాదా అని ప్రశ్నించారు.